అక్కినేని హీరో సుమంత్ (Sumanth) ప్రధాన పాత్రలో దర్శకుడు సంతోష్ జాగర్లపూడి (Santosh Jagarlapudi) తెరకెక్కిస్తున్న ఆధ్యాత్మిక సస్పెన్స్ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వరాహి’(Mahendragiri Varahi) టీజర్ (Teaser) ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మహేంద్రగిరి కొండల నేపథ్యంలో వరాహి మాత దివ్యశక్తి, పురాతన రహస్యాలు, సైన్స్ మరియు మిస్టరీ అంశాల మేళవింపుతో రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భూగర్భంలో దాగి ఉన్న అంతుచిక్కని రహస్యాలు, వింత సంఘటనలు, భయానక వాతావరణం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతూ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి.
టీజర్‌లో కనిపించిన గ్రాండ్ విజువల్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో పాటు అనూప్ రూబెన్స్(Anoop Rubens) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతాప్ ఆర్. కృష్ణా (Prathap R. Krishna) సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌ను అద్భుతంగా మలచగా, సినిమా వెనుక ఏదో పెద్ద మిస్టరీ దాగి ఉందనే భావనను బలంగా కలిగిస్తోంది. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్(Rajashyamala Entertainments), బ్రిడ్జ్ ఫిల్మ్స్(Bridge Films) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి గోస్వామి (Meenakshi Goswami) హీరోయిన్‌గా నటిస్తుండగా, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.









బాబు పాలనలో గంజాయి పంటకే గిట్టుబాటు ధర