స్టాక్ మార్కెట్ అల్ల‌క‌ల్లోలం.. ఇన్వెస్టర్లకు భారీ షాక్

స్టాక్ మార్కెట్ అల్ల‌క‌ల్లోలం.. ఇన్వెస్టర్లకు భారీ షాక్

Summarize with AI

దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) ఇన్వెస్ట‌ర్ల‌కు (Investors) పెద్ద‌ షాక్ (Shock) ఇచ్చింది. సోమవారం ఉదయం నుంచే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ భారీ ప‌త‌నాన్ని (Fall) చ‌విచూసింది. అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వాణిజ్య యుద్ధానికి సంబంధించి తలెత్తిన అంచనాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే సూచీలు భారీగా క్షీణించాయి.

భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
ప్రస్తుతం సెన్సెక్స్ (Sensex) 2,847 పాయింట్లు నష్టపోయి 72,517 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ (Nifty) కూడా 923 పాయింట్లు పడిపోయి 21,981 వద్ద ట్రేడవుతోంది. ఇది దాదాపు 52 వారాల కనిష్ట స్థాయి కావడం గమనార్హం.ట్రెంట్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, ఓఎన్టీసీ వంటి ప్రముఖ కంపెనీలు గణనీయంగా నష్టపోయాయి. ఐటీ, మెటల్ రంగాలు 7% వరకూ పడిపోయాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు కూడా ఒక్కొక్కటి 6% తగ్గాయి. ఈ పరిణామాలు పెట్టుబడిదారుల్లో ఆందోళన రేకెత్తించాయి. తాత్కాలికంగా మార్కెట్ అల్లకల్లోలంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment