చెన్నైలో చపాక్ స్టేడియంలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ vs సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో సీఎస్కే ఓటమితో అభిమానులు నిరాశ చెందారు. డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ లిస్టులో ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ కూడా ఉన్నారు. స్టేడియంలో స్నేహితులతో కలిసి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన ఆమె, చివరికి కన్నీళ్లు తుడుచుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కెప్టెన్ కూల్ ధోనీ క్రీజులోకి వచ్చినప్పుడు శ్రుతి తన ఫోన్‌లో ఫొటోలు తీస్తూ సంబరపడినప్పటికీ, మ్యాచ్ తుది ఫలితం ఆమెను తీవ్రంగా నిరాశపరిచింది. తమిళ సినీ ప్రముఖులు ఈ మ్యాచ్‌కు హాజరై స్టేడియాన్ని రుచిచూస్తుండగా, శ్రుతి హాసన్ భావోద్వేగానికి లోనవడం అభిమానుల హృదయాలను తాకింది.
కాగా, సీఎస్కే వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లో అమరన్ హీరో శివకార్తికేయన్ దంపతులు, కోలీవుడ్ తలా అజిత్ తన కుటుంబంతో సహా హాజరయ్యారు. స్టేడియంలో కోలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు.
Shruti Haasan breaks down after CSK loss ⁉️ 🥹🥹🥹😭😭#CSKvsSRH #ShrutiHaasanpic.twitter.com/vli1Dj1Ze1
— Pan India Review (@PanIndiaReview) April 25, 2025









అమరావతిలో పర్యావరణ విధ్వంసం.. జనసేన మాజీ నేత సంచలన వ్యాఖ్యలు