అందం తగ్గని శ్రియ.. కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు

అందం తగ్గని శ్రియ, కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు

Summarize with AI

రెండు దశాబ్దాలుగా వెండితెరపై కథానాయికగా వెలిగిన నటి శ్రియ శరణ్ (Shriya Saran) . 2001లో ‘ఇష్టం’ సినిమా (‘Ishtam’Movie)తో ఆమె తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత తెలుగు,తమిళ పరిశ్రమల లో అగ్ర కథానాయకులైన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, రజనీకాంత్, విజయ్, విక్రమ్, ధనుష్ వంటి వారితో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. సౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటించారు. తన చిరకాల మిత్రుడు ఆండ్రు కోచ్చోవ్‌ (Andrei Koscheev) ను వివాహమాడి వ్యక్తిగత జీవితాన్ని మొదలుపెట్టినప్పటికీ, నటనకు మాత్రం దూరం కాలేదు.

అడపాదడపా మంచి కథలు, పాత్రలు వస్తే నటిస్తూనే ఉన్నారు. అయితే, హీరోయిన్‌గా మాత్రం కనిపించడం లేదు. కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లోనూ మెరిసిన శ్రియ, ఇటీవల సూర్య కథానాయకుడిగా నటించిన ‘రెట్రో’ చిత్రంలో ఓ ప్రత్యేక పాటలో కనిపించారు. అలాగే, ‘మిరాయ్‌’ చిత్రంలోనూ ఒక కీలక పాత్రను పోషించారు. దీంతో ఆమె ఇకపై కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకే పరిమితం అవుతారని చర్చలు జరుగుతున్నాయి. దీనిపై స్పందించిన శ్రియ, “అభిమానులకు నచ్చే పాత్రలు చేస్తే, వారు మనల్ని ఇష్టపడతారు. అందుకే ఇకపై అభిమానులకు నచ్చేలా కథలను ఎంచుకుని నటిస్తాను” అని తెలిపారు. 43 ఏళ్ల వయసులోనూ తన అందాన్ని కాపాడుకుంటూ, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండడం ఆమె ప్రత్యేకత.

Join WhatsApp

Join Now

Leave a Comment