రఘురామ అరెస్టు చేయాలి – IPS సంచ‌ల‌న పోస్ట్‌

రఘురామ అరెస్టు చేయాలని డిమాండ్ - ఐపీఎస్ సంచ‌ల‌న పోస్ట్‌

Summarize with AI

ఏపీలో ర‌ఘురామ‌కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) క‌స్టోడియ‌ల్ టార్చ‌ర్ వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. వైసీపీ (YSRCP) హ‌యాంలో సీఐడీ చీఫ్‌గా (CID) ప‌నిచేసిన ఐపీఎస్ అధికారి (IPS Officer) సునీల్ కుమార్‌ (PV Sunil Kumar) ను రిటైర్ అయ్యేంత వ‌ర‌కు స‌స్పెండ్ చేస్తూ కూట‌మి ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. కేసులో ర‌ఘురామకృష్ణంరాజు (Raghurama Krishnam Raju)పై బీహార్ క్యాడ‌ర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయ‌క్ చేసిన ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నంగా మారాయి.

ఈ నేప‌థ్యంలో సీనియర్ ఐపీఎస్ అధికారి PV సునీల్ కుమార్ చేసిన తాజా ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బ్యాంకులను మోసం చేసిన కేసులో ర‌ఘురామ‌కృష్ణంరాజును వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు సీబీఐను(CBI) ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

బెదిరింపుల ఆరోపణలపై స్పందన
ఇటీవల మరో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ చేసిన ట్వీట్‌ను పీవీ సునీల్‌కుమార్ రీట్వీట్ చేశారు. తప్పుడు సాక్ష్యం చెప్పాల్సిందిగా తనను రఘురామ బెదిరించారని సునీల్ నాయక్ ఆరోపించిన నేపథ్యంలో, ఆ అంశంపై పీవీ సునీల్‌ స్పందించారు. “ఒక ఐపీఎస్ అధికారినే బెదిరించే పరిస్థితి ఉంటే, సీబీఐ కేసుల్లోని సాక్ష్యులను కూడా బెదిరించే అవకాశం ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

సీబీఐ విచారణలో ఉన్న కేసులు
ఇప్పటికే రఘురామకృష్ణంరాజుపై రూ.947 కోట్లు, రూ.238 కోట్లు ఎగ్గొట్టారనే ఆరోపణలతో రెండు కేసుల్లో సీబీఐ విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఈ కేసుల్లో సాక్షుల భద్రత అత్యంత ముఖ్యమని పీవీ సునీల్‌కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాక్షులను రక్షించడానికి నిందితుడిని అరెస్టు చేయడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాలపై తక్షణమే దృష్టి సారించాలని సీబీఐను కోరారు. పీవీ సునీల్‌కుమార్ చేసిన ఈ ట్వీట్ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో సంచలనం రేపుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment