సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. 42 మంది సజీవదహనం

సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. 42 మంది సజీవదహనం

Summarize with AI

సౌదీ అరేబియా (Saudi Arabia)లో జరిగిన భయంకర బస్సు ప్రమాదం (Bus Accident) అంతర్జాతీయస్థాయిలో కలకలం రేపింది. మక్కా (Makkah) నుండి మదీనా (Medina)కు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దారుణ ఘటనలో 42 మంది యాత్రికులు సజీవదహనం కాగా, హైదరాబాద్‌కు చెందిన 18 మంది యాత్రికుల బృందం కూడా బస్సులో ఉన్నట్లు సమాచారం.

అంతులేని విషాదం
అధికారుల సమాచారం ప్రకారం, బస్సు వేగంగా ప్రయాణిస్తుండగా డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఢీకొన్న సమయానికే ట్యాంకర్‌ నుండి భారీగా మంటలు చెలరేగి క్షణాల్లోనే బస్సును చుట్టేశాయి. బస్సు తలుపులు తెరచుకునేలోపే మంటలు వ్యాపించడంతో, పలువురు యాత్రికులు బయటకు రాలేక సజీవదహనమయ్యారు. క్ష‌ణాల్లోనే మంట‌లు వేగంగా వ్యాపించి బస్సు పూర్తిగా కాలిపోయింది. మృతుల్లో 21 మంది మహిళలు, 11 మంది పిల్లలు ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. పలువురు ప్రయాణికుల మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తింపు ప్రక్రియ కఠినమవుతున్న‌ట్లు స‌మాచారం.

హైదరాబాద్ యాత్రికుల బృందం
ప్రాథమిక సమాచార ప్రకారం, బస్సులో హైదరాబాద్‌కు చెందిన 18 మంది యాత్రికుల బృందం కూడా ప్రయాణిస్తున్నట్లు వెలువడిన సమాచారం ఆ ప్రాంత కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఘటనలో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిపై అధికారుల నుంచి వివరాలు ఇంకా రాలేదు. ఈ ప్రమాదం సౌదీలో ఇప్పటివరకు జరిగిన అత్యంత భయంకర బస్సు ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment