సనాతన ధర్మంలో విడాకుల‌కు చోటుందా..?

సనాతన ధర్మంలో విడాకుల‌కు చోటుందా..?

Summarize with AI

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో “సనాతన ధర్మం” (Sanatana Dharma) మరోసారి చర్చనీయాంశంగా నిలిచింది. ఈసారి సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి కె. నారాయణ (K. Narayana) జనసేన (JanaSena) అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)‌ను నేరుగా టార్గెట్ (Target) చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మంపై పవన్ కల్యాణ్ బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు, దానిని సమర్థిస్తున్న తీరును నారాయణ గట్టిగా విమర్శించారు.

విడాకుల‌కు చోటుందా..?
తాజాగా మీడియాతో మాట్లాడిన కె. నారాయణ, “పవన్ కల్యాణ్ సనాతన ధర్మాన్ని సమర్థిస్తున్నారని చూస్తున్నాం. ఆ ధర్మంలో విడాకులకు (Divorce) చోటు ఉందా? లేనప్పుడు పవన్‌కు విడాకులు ఎలా వచ్చాయి? సనాతన ధర్మం అనేది దారుణమైన వ్యవస్థ (Cruel System). దాన్ని విమర్శించేవారిని కాదు, దాన్ని సమర్థించేవారిని అరెస్ట్ చేయాలి,” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌పై గతంలోనూ విమర్శలు గుప్పించిన నారాయణ, ఈసారి సనాతన ధర్మాన్ని వ్యక్తిగత జీవితంతో ముడిపెడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

పవన్ కల్యాణ్‌పై విమ‌ర్శ‌లు..
పవన్ కల్యాణ్ గత కొన్ని నెలలుగా సనాతన ధర్మ పరిరక్షణపై బలమైన వాదనలు వినిపిస్తున్నారు. ఆయన ఇటీవల తిరుమలలో (Tirumala) చేసిన వ్యాఖ్యల్లో, “నేను ముమ్మాటికీ సనాతన హిందువును. నా ప్రాణాల్ని అడ్డుపెట్టైనా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాను” అని ప్రకటించారు. అయితే ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై అప్ప‌ట్లో విమ‌ర్శ‌లు వ్య‌క్తం అయ్యాయి. సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ కూడా చేశారు. క్రిస్టియ‌న్ యువ‌తిని పెళ్లి చేసుకున్నాడ‌ని, మూడు పెళ్లీళ్లు (Three Marriages) చేసుకున్న వ్య‌క్తి స‌నాత‌న ధ‌ర్మం గురించి మాట్లాడ‌వ‌చ్చా…? ముస్లింల ఇంట్లోకి వెళ్లి మాంసాహారం తిన్న వ్య‌క్తి స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌కుడా..? లెఫ్ట్ పార్టీలతో జ‌త‌క‌ట్టిన వ్య‌క్తి స‌నాత‌న వాదిగా ఎలా మారాడు..? అని గ‌తంలో అనేక ప్ర‌శ్న‌లు తెర‌పైకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

సనాతన ధర్మంపై వివాదం
నారాయణ సనాతన ధర్మాన్ని “దారుణమైన వ్యవస్థ”గా పేర్కొనడం రాజకీయ వివాదాన్ని మరింత రాజుకుంది. నారాయణ వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు నారాయణ వ్యాఖ్యలను స‌మ‌ర్థిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment