రోషన్-అనస్వర జోడీతో ‘ఛాంపియన్’..ఎన్టీఆర్ సపోర్ట్

రోషన్-అనస్వర జోడీతో ‘ఛాంపియన్’..ఎన్టీఆర్ సపోర్ట్

టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేకా (Roshan Meka), అనస్వర రాజన్ (Anaswara Rajan) జంటగా నటించిన ‘ఛాంపియన్’ (Champion) సినిమా డిసెంబర్ 25న గ్రాండ్‌గా విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ పీక్‌లో ఉన్నాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ సినిమాపై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. “స్టూడెంట్ నంబర్ 1 నుంచి ఛాంపియన్ వరకు.. స్వప్న దత్ (Swapna Dutt) సినిమాలు ఎప్పుడూ కొత్త టాలెంట్లను ప్రోత్సహిస్తాయి. వాళ్లు చేసే ప్రతి సినిమా వెనుక ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది” అని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.

తరువాత తారక్ స్వప్న దత్ తనకు ఎప్పుడూ అండగా ఉంటారని, తాను కూడా ఎప్పుడూ స్వప్న టీమ్‌కు సపోర్ట్‌గా ఉంటానని తెలిపారు. హీరో రోషన్, అనస్వర, డైరెక్టర్ ప్రదీప్ అద్వైత్‌ (Pradeep Advaith) కు “ఆల్ ది బెస్ట్” చెప్పారు. 2025 చివర్లో ఈ సినిమా మెమరబుల్ హిట్ కావాలని తారక్ ఆశించారు. తారక్ సపోర్ట్‌తో ‘ఛాంపియన్’ పై ప్రేక్షకుల అంచనాలు పెరిగాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రామిసింగ్‌గా ఉన్నాయి. క్రిస్మస్ కానుకగా విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధిస్తుందో చూడాలి!

Join WhatsApp

Join Now

Leave a Comment