ఇబ్రహీంపట్నం కళ్యాణి హత్య కేసులో షాకింగ్‌ విషయాలు.. ఇద్దరు అరెస్ట్‌

ఇబ్రహీంపట్నం కళ్యాణి హత్య కేసులో షాకింగ్‌ విషయాలు.. ఇద్దరు అరెస్ట్‌

Summarize with AI

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో(Ibrahimpatnam) సంచలనం రేపిన యువతి కళ్యాణి (Kalyani) హత్య కేసులో(Murder Case) కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కళ్యాణిని హత్య చేసింది ఆమెతో సన్నిహితంగా ఉండే మటన్ షాప్ నిర్వాహకుడు షఫీగా(Shafi) పోలీసులు గుర్తించారు. హౌసింగ్ బోర్డు కాలనీలో మటన్ షాప్ (Mutton Shop) నిర్వహించే షఫీతో కళ్యాణికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కళ్యాణి కుమారుడిని కూడా షఫీనే పెంచుతున్నట్లు దర్యాప్తులో తేలింది.

అయితే విలాసాలకు అలవాటు పడిన కళ్యాణి తరచూ డబ్బులు ఇవ్వాలని షఫీని ఒత్తిడి చేసేదని.. డబ్బులు ఇవ్వకపోతే అత్యాచారం కేసు పెడతానంటూ బెదిరించేదని పోలీసులు చెబుతున్నారు. ఈ నెల 17వ తేదీ రాత్రి 20 వేల రూపాయలు ఇవ్వాలని కళ్యాణి అడగడంతో… ప్రకాశం బ్యారేజ్(Prakasam Barrage) సమీపం నుంచి ఆమెను భవానీపురంలోని తన ఇంటికి తీసుకెళ్లిన షఫీ.. అక్కడ కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత తన మటన్ షాప్‌లో పనిచేసే గురువులు అనే వ్యక్తిని ఇంటికి పిలిపించాడు షఫీ. ఇద్దరూ మద్యం సేవించి… మటన్ కొట్టేందుకు ఉపయోగించే కత్తులతో కళ్యాణి మృతదేహాన్ని ముక్కలుగా నరికినట్లు పోలీసులు వెల్లడించారు.

ఆ తర్వాత మృతదేహం ముక్కలను బ్యాగుల్లో పెట్టుకుని గొల్లపూడి (Gollapudi) వద్ద కూలింగ్ కెనాల్‌లో పడేసినట్లు దర్యాప్తులో తేలింది. కేసు దర్యాప్తులో భాగంగా షఫీ, గురువులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కళ్యాణికి సన్నిహితులుగా ఉన్న బంగారు షాప్ దామోదర్(Gold Shop Damodar), కరీం హోటల్ గోస్(Kareem Hotel Gouse), ఆల్ఫా హోటల్ అదానీ అలీ (Alpha Hotel Adani Ali) పాత్రపైనా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ హత్య వెనుక మరెవరైనా ఉన్నారా..? మృతదేహాన్ని ముక్కలుగా చేయడంలో ఇంకెవరైనా సహకరించారా..? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment