రోహిత్ శర్మకు గాయం.. చిక్కుల్లో టీమిండియా

రోహిత్ శర్మకు గాయం.. చిక్కుల్లో టీమిండియా

Summarize with AI

వ‌రుస గాయాలు టీమిండియాను చిక్కుల్లో ప‌డేస్తున్నాయి. నెట్ సెష‌న్ల‌లో ప్రాక్టీస్ సంద‌ర్భంగా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ గాయ‌ప‌డ్డారు. ఇప్పటికే ఓపెనర్ కేఎల్ రాహుల్ చేతికి గాయం కాగా, ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డారు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో, రోహిత్ శర్మ ఎడమ మోకాలికి బంతి బలంగా తాకింది.

రోహిత్ పరిస్థితి పట్ల ఆందోళన
గాయం తర్వాత రోహిత్ నొప్పితో పక్కన కూర్చుండిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, మ్యాచ్ జరగడానికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉండటంతో, రోహిత్ సహా గాయపడిన ఆటగాళ్లు కోలుకుంటారని టీమ్ ఇండియా వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment