విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) 2025–26లో ముంబై తరఫున ఆడుతున్న టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) రెండో మ్యాచ్‌లో నిరాశపరిచాడు. జైపుర్ (Jaipur) వేదికగా ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ గోల్డెన్ డకౌట్ (Golden Duck)గా వెనుదిరిగాడు. ఇనింగ్స్ తొలి బంతికే దేవేంద్ర సింగ్ బోరా బౌలింగ్‌లో జగమోహన్ నాగర్‌కోటికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
కేవలం ఒక బంతినే ఎదుర్కొని పెవిలియన్ చేరడంతో రోహిత్ అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. తొలి మ్యాచ్‌లో సిక్కింను ఎదుర్కొన్న రోహిత్ శర్మ అద్భుత సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.
ఇక విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అర్ధసెంచరీతో మెరిశాడు. 61 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 77 పరుగులు చేసి ఔటయ్యాడు.
కోహ్లీ ఔట్ అయిన తర్వాత ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ దూకుడుగా ఆడుతూ గుజరాత్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. పంత్ 79 బంతుల్లో 70 పరుగులు చేసి ఔటవ్వగా, అతడి ఇన్నింగ్స్‌తో ఢిల్లీ 30 ఓవర్లలో 150 పరుగుల మార్కును దాటింది.








