అజిత్ మ‌ర‌ణం.. ‘విమాన సంస్థ‌తో హెరిటేజ్‌కు లింకులు’

అజిత్ మ‌ర‌ణం.. 'విమాన సంస్థ‌తో హెరిటేజ్‌కు లింకులు'

Summarize with AI

మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ సీనియ‌ర్ నేత దివంగ‌త అజిత్ ప‌వార్ (Ajit Pawar) విమాన ప్ర‌మాదంపై (Plane Crash) ఆయ‌న మేన‌ల్లుడు రోహిత్ ప‌వార్ (Rohit Pawar) సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఈ ప్ర‌మాదం వెనుక రాజ‌కీయ‌, ఆర్థిక ప‌ర‌మైన కుట్ర ఉంద‌ని, ద‌య‌చేసి టీడీపీ ఎంపీ, విమాన‌యాన శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడును (Ram Mohan Naidu) మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించాల్సిందిగా ప్ర‌ధాని మోడీ (Narendra Modi), అమిత్ షా (Amit Shah)ల‌ను, ఈ విష‌యంలో స‌హ‌కారం అందించాల‌ని ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి విజ్ఞ‌ప్తి చేశారు.

అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ఆయన మేనల్లుడు రోహిత్ ప‌వార్‌ ఢిల్లీలో సంచలన ఆరోపణలు చేశారు. శ‌రద్ ప‌వార్‌ (Sharad Pawar) నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అజిత్ ప‌వార్ విమాన ప్ర‌మాదం వెనుక ఉన్న‌వారు ఎవ‌రో తేలాలంటే వెంట‌నే పౌర విమాన‌యాన శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడుతో రాజీనామా చేయించాల‌ని డిమాండ్ చేశారు.

“వీఎస్ఆర్ కంపెనీని కాపాడే ప్రయత్నం”
రోహిత్ పవార్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ప్రమాదానికి కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న VSR కంపెనీ వెనుక డీజీసీఏలోని ఉన్నతాధికారుల హస్తం ఉందని చెప్పారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడుకు VSR కంపెనీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. దర్యాప్తు నివేదిక రాకముందే ఆ కంపెనీకి క్లీన్ చిట్ ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. మంత్రి పదవిలో రామ్మోహన్ నాయుడు కొనసాగితే దర్యాప్తు నిష్పాక్షికంగా సాగదని, వెంటనే ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. టీడీపీ నుంచి రాజీనామా తీసుకోవాలని కూడా కోరారు.

  • కీలక ఆరోపణలు
  • ప్రమాదంలో ఉన్న విమానంలో అవసరానికి మించి ఇంధనం నింపారు.
  • విమానంలో అజిత్ ప‌వార్ సీటు వెనుక పెట్రోల్ క్యాన్లు ఉంచారు.
  • బ్లాక్ బాక్స్‌లోని సీవీఆర్ పూర్తిగా తగలబడిందని చెప్పడం అబద్ధం.
  • డీజీసీఏ, విమానయాన మంత్రిత్వ శాఖ ద్వారా విచారణపై ఒత్తిడి ఉంది.
  • శ్వేత సింగ్ దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారు.

హెరిటేజ్ లింకులపై ప్రశ్నలు
VSR కంపెనీకి హెరిటేజ్ సంస్థతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని రోహిత్ పవార్ ఆరోపించారు. ఆ కమర్షియల్ లింకులే VSR కంపెనీకి రక్షణ కల్పిస్తున్నాయేమోనని అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ ముఖ్య నేతలు, ఏపీ ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. రూ.160 కోట్లతో ఏపీ మంత్రి ప్రైవేట్ జెట్ కొనుగోలు చేశారన్న వార్తలపై కూడా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విమానాల యాజమాన్యం, ఫండింగ్ వివరాలు ప్రజలకు వెల్లడించాలని అన్నారు.

కేంద్ర జోక్యం కోరిన రోహిత్ పవార్
ఈ కేసులో నిజానిజాలు వెలుగులోకి రావాలంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), హోంమంత్రి అమిత్ షా (Amit Shah) జోక్యం చేసుకోవాలని రోహిత్ పవార్ కోరారు. అజిత్ పవార్‌కు న్యాయం జరగాలంటే పారదర్శక, స్వతంత్ర దర్యాప్తు అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆరోపణలతో విమాన ప్రమాదంపై రాజకీయ వేడి మరింత పెరిగింది. కేంద్ర ప్రభుత్వం, సంబంధిత శాఖలు ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment