రామ్ చరణ్ ‘పెద్ది’ ఓటీటీలో ఎప్పుడంటే?

రామ్ చరణ్ 'పెద్ది' ఓటీటీలో ఎప్పుడంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన బ్లాక్‌బస్టర్ ‘పెద్ది'(Peddi) ఓటీటీ(OTT) విడుదలపై కొత్త చర్చ మొదలైంది. థియేటర్లలో రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా డిజిటల్ ప్రీమియర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలుత ఈ చిత్రం జూలై 16, 2026 (July 16, 2026) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) స్ట్రీమింగ్ కానుందనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజా ప్రచారం ప్రకారం ఓటీటీ విడుదల మరో రెండు వారాలు వాయిదా పడే అవకాశముందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయినప్పటికీ విడుదల తేదీపై ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్ (Netflix) లేదా చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇక హిందీ వెర్షన్‌ను (Hindi Version) తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల కంటే ఆలస్యంగా జూలై 30, 2026న విడుదల చేసే అవకాశముందనే ప్రచారం కూడా సాగుతోంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతుండటంతో థియేట్రికల్ కలెక్షన్లపై ప్రభావం పడకుండా ఉండేందుకే ఓటీటీ విడుదలను వాయిదా వేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇవన్నీ అధికారికంగా ధృవీకరించని ప్రచారమే కావడంతో, ‘పెద్ది’ ఓటీటీ విడుదల తేదీపై స్పష్టత రావాలంటే నెట్‌ఫ్లిక్స్ లేదా చిత్ర యూనిట్ నుంచి వచ్చే అధికారిక ప్రకటన (Official Announcement) కోసం అభిమానులు వేచి చూడాల్సిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment