ఆర్భాటాలు వద్దు, లెక్కలు చెప్పు.. పవన్‌కు నటుడు రాహుల్ సూటి ప్రశ్న!

ఆర్భాటాలు వద్దు, లెక్కలు చెప్పు.. పవన్‌కు నటుడు రాహుల్ సూటి ప్రశ్న!

Summarize with AI

సినీ నటుడు, కమెడియన్ రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) సోషల్ మీడియా వేదికగా సంధించిన ప్రశ్నలు ఇప్పుడు అటు ఏపీ(AP), ఇటు తెలంగాణ (Telangana) రాజకీయాలతో పాటు సినీ వర్గాల్లోనూ తీవ్ర దుమారం రేపుతున్నాయి. సమాజంలో జరిగే పరిణామాలపై ఎప్పటికప్పుడు ముక్కుసూటిగా స్పందించే రాహుల్.. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను (Pawan Kalyan) టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు పెట్టడం సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న శాఖల పారదర్శకతను, ఆయన చేస్తున్న ప్రకటనలను తీవ్రంగా విమర్శిస్తూ రాహుల్ రామకృష్ణ వేసిన ప్రశ్నలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ-పర్యావరణ శాఖల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్లు జనసేన (Jana Sena) శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. అయితే, ఈ ప్రచారాల వెనుక ఉన్న వాస్తవాలను రాహుల్ రామకృష్ణ ప్రశ్నించారు.

“పవన్ కళ్యాణ్.. మీ సాధారణ ఆర్భాటాలు, గొప్పలను కాసేపు పక్కన పెడితే.. మీరు నిర్వహిస్తున్న ప్రతి పదవిలోని ప్రతి విభాగంలో సమాచార హక్కు చట్టం (RTI) కింద ‘ముందస్తు సమాచార బహిర్గతానికి’ సంబంధించిన సెక్షన్ 4.1(బి)ని అమలు చేశారా సార్? నేను మీ అభిమానిగా అడుగుతున్నా.. మీరు మా ప్రశ్నలకు నిరంతరం సమాధానం చెప్పాలి” అంటూ రాహుల్ గట్టి చురకలు అంటించారు.

పాలనలో పారదర్శకత అంటూ ప్రసంగాలు దంచే పవన్, తన స్వంత శాఖల్లో మాత్రం చట్ట ప్రకారం సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదా అనే సందేహాన్ని రాహుల్ ఈ ట్వీట్ ద్వారా లేవనెత్తారు.

“PESA (పెసా) చట్టం, 1/70 చట్టం, గ్రామసభ చట్టం (Grama Sabha Act) అమలుకు సంబంధించిన ఫలితాలను దయచేసి అడిగి చూపించండి. అలాగే మీరు చేసినట్లు చెబుతున్న అటవీకరణ (Afforestation) కార్యక్రమాల వివరాలు కూడా చెప్పండి. ఒక స్వతంత్ర సంస్థ ధృవీకరించిన గణాంకాల ప్రకారం చూస్తే.. ఆ లెక్కలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. నేను స్వయంగా దాఖలు చేసి, గుర్తించిన ఫలితాల గురించే మిమ్మల్ని అడుగుతున్నాను” అని నిలదీశారు.

గిరిజన ప్రాంతాల్లో చట్టాల అమలుపై పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయా? ఒక స్వతంత్ర సంస్థ లెక్కల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటే.. పవన్ శాఖల్లో జరుగుతున్న అవినీతి లేదా వైఫల్యాలను ఒప్పుకుంటారా? అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

‘దేశద్రోహిని కాను’ అంటూ కౌంటర్!
మరోవైపు, పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నిస్తే ఆయన అభిమానులు, జనసేన సోషల్ మీడియా సైన్యం చేసే దాడులు, ట్రోలింగ్‌ను రాహుల్ ముందుగానే ఊహించారు. అందుకే మరో ట్వీట్‌లో.. “ప్రశ్నించినంత మాత్రాన నేను దేశద్రోహిని కాను” అని స్పష్టం చేస్తూ పవన్ అభిమానుల నోళ్లకు తాళం వేశారు. జనసేన గతంలో ‘ప్రశ్నించడానికే వచ్చాం’ అని చెప్పుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు అదే పవన్‌ను ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారా అనే విమర్శలు ఈ ట్వీట్ ద్వారా బలపడుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment