దేశ ఆర్థిక సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వ(Central Government) వైఫల్యాలే కారణమని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ (Prime Minister Modi) 12 ఏళ్ల పాలనలో దేశాన్ని చివరకు ‘ప్రజలు ఏం కొనాలో.. ఏం కొనకూడదో’ నిర్దేశించే స్థితికి తీసుకువచ్చారని ఆయన విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక ఘాటైన ట్వీట్ చేశారు.
ప్రజలపై ఆంక్షలా? మీ వైఫల్యమా?
బంగారం (Gold) కొనవద్దని, విదేశాలకు వెళ్లవద్దని, పెట్రోల్(Petrol), డీజిల్(Diesel), ఫర్టిలైజర్స్(Fertilizers) (ఎరువులు), వంటనూనె(Cooking Oil) వాడకాన్ని తగ్గించుకోవాలని చెప్పడం ప్రభుత్వ అసమర్థతను చాటుతోందని రాహుల్ మండిపడ్డారు. “ప్రజల కనీస అవసరాలను తీర్చలేక, విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోలేక.. మోడీ ప్రభుత్వం ప్రజల జీవనశైలిని శాసించడానికి ప్రయత్నిస్తోంది” అని ఆయన ఆరోపించారు.
జవాబుదారీతనం నుంచి పరార్..
మోడీ ప్రభుత్వం ప్రతిసారీ తన తప్పులను ప్రజల (People) మీదకు నెట్టేస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. “సమస్య వచ్చిన ప్రతిసారి బాధ్యతను ప్రజలపై తోసేసి, తన జవాబుదారీతనం (Accountability) నుంచి మోడీ తప్పుకుంటున్నారు. దేశ ప్రయోజనాల విషయంలో ప్రధాని మోడీ రాజీ పడ్డారు. సామాన్యుడిని భయపెడుతూ, కార్పొరేట్ శక్తులకు మేలు చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం” అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం రాహుల్ గాంధీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాంగ్రెస్ శ్రేణులు ఈ ట్వీట్‌ను షేర్ చేస్తూ మోడీ వైఫల్యాలపై చర్చను లేవనెత్తుతున్నాయి.
मोदी जी ने कल जनता से त्याग मांगे – सोना मत ख़रीदो, विदेश मत जाओ, पेट्रोल कम जलाओ, खाद और खाने का तेल कम करो, मेट्रो में चलो, घर से काम करो।
— Rahul Gandhi (@RahulGandhi) May 11, 2026
ये उपदेश नहीं – ये नाकामी के सबूत हैं।
12 साल में देश को इस मुक़ाम पर ला दिया है कि जनता को बताना पड़ रहा है – क्या ख़रीदे, क्या न…








