ప్రధాని మోడీ నివాసానికి రాహుల్.. అసలు ఏం జరిగింది?

ప్రధాని మోడీ నివాసానికి రాహుల్.. అసలు ఏం జరిగింది?

Summarize with AI

కాంగ్రెస్ ఎంపీ, పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఢిల్లీలోని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) నివాసానికి వెళ్లారు. భారత కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) నియామకం గురించి చర్చించేందుకు ప్రధాని మోడీ ప్రతిపక్షాలను సంప్రదించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సమావేశానికి హాజరై, చర్చల అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ప్రస్తుతం ఎన్నికల కమిషనర్‌గా (Election Commissioner) ఉన్న రాజీవ్ కుమార్ (Rajeev Kumar) పదవి మే 15న ముగియనుండటంతో, ఆయన స్థానంలో కొత్త నియామకంపై చర్చించేందుకు ప్రధాని మోడీ ఈ భేటీ ఏర్పాటు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎంపిక ప్రక్రియలో భాగంగా, ప్రధాని మోడీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి నామినేట్ చేసిన కేంద్ర మంత్రి (Union Minister) సమావేశంలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment