షూటింగ్‌కు బ్రేక్.. ప్రభాస్ న్యూ ఇయర్ సెల‌బ్రేష‌న్స్‌!

షూటింగ్‌కు బ్రేక్.. ప్రభాస్ న్యూ ఇయర్ సెల‌బ్రేష‌న్స్‌!

Summarize with AI

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజా సాబ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. తరువాత హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రారంభమవ్వనున్న ‘ఫౌజీ’ చిత్రానికి సిద్ధం కావాల్సి ఉంది. అయితే, తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ కొన్నిరోజుల పాటు షూటింగ్‌కి విరామం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఇటలీ ప్లాన్స్..
న్యూ ఇయర్ సందర్భంగా ప్రభాస్ ఇటలీకి వెళ్లి అక్కడ తన సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకున్నట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. అదేవిధంగా, బిజీ షెడ్యూల్‌కి బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్న ప్రభాస్, అక్కడ కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటారని సమాచారం.

ఇటలీ ట్రిప్ అనంతరం ఆయన మళ్లీ షూటింగ్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఈ విరామం ప్రభాస్ తదుపరి ప్రాజెక్టులకు కొత్త ఎనర్జీని తీసుకురావడంలో సహాయపడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment