అమరావతి రాజధాని (Amaravati Capital) ప్రాంతం, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి (CM Chandrababu Residence) సమీపంలోని పెనుమాక గ్రామంలో (Penumaka Village) కొందరు యువకులు గంజాయి (Ganja) మత్తులో దౌర్జన్యానికి పాల్పడ్డారు. బాధితుడి ఇంటికి వచ్చి బెదిరింపులకు గురిచేయడమే కాకుండా, ఆవరణలో నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారంటూ బాధితుడు చప్పిడి శివయ్య (Shivayya) ఆవేదన వ్యక్తం చేశారు. బైక్‌ను ధ్వంసం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బాధితుడు శివయ్య (Shivayya) వివరాల ప్రకారం… గతనెల అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) రోజున ఆయన తన కుమార్తెతో కలిసి యజమాని కారులో ఉండవల్లి గుహల వద్దకు వెళ్తుండగా, ఒక ఆటో వచ్చి కారును ఢీకొట్టింది. ఈ క్రమంలో శివయ్య కారు దిగి, “నేనూ డ్రైవర్‌నే, నెమ్మదిగా వెళ్లండి… ఏమైనా జరిగితే అందరికీ ఇబ్బంది అవుతుంది” అని ఆటో డ్రైవర్‌కు (Auto Driver) సూచించారు. అయితే ఆటోలోని వ్యక్తి కిందకు దిగి శివయ్యపై దౌర్జన్యానికి దిగాడని తెలిపారు.
ఈ వివాదం మనసులో ఉంచుకుని, ఈనెల 5వ తేదీన ఆటో డ్రైవర్ శివకృష్ణ (Shivakrishna) తన అనుచరులైన మరో ఆరుగురితో కలిసి పెనుమాకలోని టిడ్కో ఇళ్ల వద్ద ఉన్న శివయ్య నివాసానికి వచ్చారు. బాధితుడి ఇంటి తలుపులు గట్టిగా కొడుతూ “పోలీసులకు(Police) చెప్పినా ఏమీ కాదు, మేం ఇప్పటికే గంజాయి కేసులో పట్టుబడి వెంటనే బయటకు వచ్చాం.. నీ కేసు మాకు పెద్ద లెక్క కాదు” అంటూ తీవ్రంగా బెదిరించినట్లు బాధితుడు పేర్కొన్నారు. అనంతరం ఇంటి బయట పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాన్ని లాక్కెళ్లి తీవ్రంగా ధ్వంసం చేశారని శివయ్య ఆరోపించారు.
ఈ ఘటనపై వెంటనే తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ, నిందితులపై పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకోకపోగా, సమస్యను రాజీ చేసుకోవాలని, నిందితులే వాహనం బాగు చేయిస్తారని పోలీసులు సూచిస్తున్నారని శివయ్య తెలిపారు. తమకు న్యాయం చేసి, సదరు యువకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన మంత్రి నారా లోకేష్‌ను(Nara Lokesh) వేడుకుంటూ వీడియో విడుదల చేశాడు.
పెనుమాకలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్
— Telugu Feed (@Telugufeedsite) July 20, 2026
మత్తులో రెచ్చిపోయి ఇష్టానుసారం ద్విచక్ర వాహనం ధ్వంసం
దౌర్జన్యం చేస్తున్న యువకులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు చప్పిడి శివయ్య వేడుకోలు
గతనెల యోగా దినోత్సవం రోజు ఉండవల్లి గుహల వద్ద కుమార్తెతో కలసి తన యజమాని కారులో వెళుతుండగా శివయ్య… pic.twitter.com/GZXAn8OTQO








‘డీఎస్సీ’లో గట్టిగా ఇరుక్కున్నారు.. తప్పించుకోలేరు