పాక్ క‌వ్వింపు చ‌ర్య‌లు.. ఇండియ‌న్ ఆర్మీ స్ట్రాంగ్ రిప్లై

పాక్ క‌వ్వింపు చ‌ర్య‌లు.. ఇండియ‌న్ ఆర్మీ స్ట్రాంగ్ రిప్లై

Summarize with AI

పహల్గామ్ (Pahalgam) ఉగ్రదాడి (Terrorist Attack) జరిగిన తర్వాత పాకిస్థాన్ ఆర్మీ (Pakistan Army) మరోసారి భారత సైన్యంపై (Indian Army) కవ్వింపు (Provocation) చర్యలకు పాల్పడింది. జమ్మూ కశ్మీర్‌ (Jammu Kashmir) లోని కుప్వారా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాల‌ వెంబ‌డి ఉన్న నియంత్రణ రేఖ (LoC) వెంబడి బుధ‌వారం రాత్రి పాక్ సైనికులు కాల్పులు (Firing) జరిపారు.

పాక్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు స్పందించ‌కుండా.. భారత్ సంయమనంతో వ్యవహరిస్తున్నప్పటికీ, పాకిస్థాన్ తరచుగా హాట‌ల్‌లైన్‌ వ‌ద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. కాగా, నిన్న రాత్రి పాకిస్తాన్ జ‌రిపిన దాడుల‌కు భారత ఆర్మీ కూడా దీటుగా ప్రతిస్పందించింది. దీంతో ఇద్దరు పాక్ జవాన్లు (Pakistan Soldiers) గాయపడ్డట్లు ప్రాథ‌మిక‌ సమాచారం. సరిహద్దుల్లో ఈ తరహా కవ్వింపు చర్యలు శాంతిని దెబ్బతీసే ప్రమాదం ఉన్నట్లు ప‌లువురు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ఉద్రిక్తతలు మరింత పెరగవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

దేశ స‌రిహ‌ద్దుల వ‌ద్ద కాల్పులు జరిపి, ఇండియ‌న్ ఆర్మీని రెచ్చ‌గొట్టే దుస్సాహసానికి పాక్ ఒడిగ‌డుతోంది. బార్డ‌ర్‌లో క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంది. ప‌హల్గామ్‌లో ప‌ర్యాట‌కుల‌పై దాడికి పాల్ప‌డిన ఉగ్రవాదుల కోసం భార‌త్‌ ఇప్ప‌టికే ముమ్మరంగా గాలిస్తోంది. త్రివిధ ద‌ళాల అధిప‌తుల‌తో స‌మావేశ‌మైన ప్ర‌ధాని మోడీ, సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామ‌ని ప్ర‌క‌టించారు. ఉగ్ర‌వాదాన్ని అంతం చేస్తామ‌ని చెప్పారు. తేదీ, స‌మ‌యం ఇండియ‌న్ ఆర్మీ డిసైడ్ చేస్తోంద‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment