ఓయూ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 12 మందిపై కేసు

ఓయూ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 12 మందిపై కేసు

ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపింది. ఫస్ట్ ఇయర్ బీడీఎస్ విద్యార్థులను కొందరు సీనియర్ విద్యార్థులు వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధిత విద్యార్థులు ఈ విషయాన్ని కాలేజీ ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లడంతో ఘటనపై వెంటనే విచారణ చేపట్టారు. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.

ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపిన కాలేజీ యాజమాన్యం 12 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు గుర్తించింది. అనంతరం వారిపై ర్యాగింగ్ కేసు నమోదు చేయడంతో పాటు ఆరుగురు నెలలపాటు సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ను ఏమాత్రం సహించబోమని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు కొనసాగుతాయని కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment