ఎన్టీఆర్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..

ఎన్టీఆర్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..

Summarize with AI

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ (NTR-Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఫ్యాన్స్‌లో ఉన్న క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి విడుదల తేదీ మార్పు జరగడంతో అభిమానులకు కొంత షాక్ తగిలినట్టే. మొదటగా 2026 జూన్‌లో రిలీజ్ అవుతుందని ప్రకటించిన ఈ ప్రాజెక్ట్, భారీ యాక్షన్ సీన్స్, హై క్వాలిటీ విజువల్స్ కారణంగా షూటింగ్ ఆలస్యమవుతూ ఇప్పుడు 2027 జూన్ 11కి షిఫ్ట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ స్టైల్‌లో ప్రతి సన్నివేశాన్ని అత్యంత రిచ్‌గా తీర్చిదిద్దుతున్నారని, అందుకే టైమ్ ఎక్కువ తీసుకుంటున్నారని సమాచారం.

ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్(NTR) పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. భారీగా వెయిట్ లాస్ అయి, మస్క్యులర్ బాడీతో పవర్‌ఫుల్ అవతారంలో కనిపించనున్నాడని టాక్. హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ (Anil Kapoor) కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే కట్ చేసిన గ్లింప్స్‌పై భారీ హైప్ నెలకొనడంతో, అభిమానులు “డ్రాగన్” ఫస్ట్ లుక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment