అఖిల్ కోసం రంగంలోకి తారక్?.. ‘లెనిన్’ ఈవెంట్‌పై క్రేజీ బజ్

అఖిల్ కోసం రంగంలోకి తారక్?.. ‘లెనిన్’ ఈవెంట్‌పై క్రేజీ బజ్

అక్కినేని యువ హీరో అఖిల్(Akhil) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘లెనిన్’ (Lenin) విడుదలకు సిద్ధమవుతుండగా, సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. మురళీ కిషోర్ అబ్బూరు (Murali Kishore Abburu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ (Love Story) జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్(Teaser), పాటలు (Songs) మంచి స్పందన తెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సినిమాలో అఖిల్ (Akhil), భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) చిత్తూరు యాసలో కనిపించనున్న నేపథ్యంలో స్థానిక ప్రేక్షకులతో మరింత కనెక్ట్ కావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే, ‘లెనిన్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు (Pre-Release Event) యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr. NTR) ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలపై సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. నిర్మాత సూర్యదేవర నాగవంశీతో(Suryadevara Naga Vamsi)తారక్‌కు ఉన్న అనుబంధం, అలాగే అఖిల్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ ఈవెంట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఎన్టీఆర్ నిజంగానే హాజరైతే తిరుపతిలో అక్కినేని, నందమూరి అభిమానుల సందడి తారాస్థాయికి చేరడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment