నిర్మాత‌గానూ స‌క్సెస్ ఫుల్‌గా..

కొత్త టాలెంట్‌ను పరిచయం చేస్తున్న నాని

Summarize with AI

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా తనదైన ముద్ర వేస్తూనే నిర్మాతగా కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి, సూపర్ హిట్ సినిమాలను అందిస్తున్నారు. అ!, హిట్, హిట్-2 వంటి విజయవంతమైన చిత్రాలు దీనికి నిదర్శనం.

ఇప్పుడీ జాబితాలో మరో ఆసక్తికరమైన సినిమా చేరింది. కోర్టు సినిమాకు నాని నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. సినీ విశ్లేషకుల ప్రకారం, ఈ సినిమా కూడా నాని బ్యానర్‌లో మరో విజయవంతమైన ప్రయత్నంగా నిలుస్తుందని చెబుతున్నారు. ప్రశాంత్ వర్మ, శైలేశ్ కొలను వంటి టాలెంటెడ్ దర్శకులను పరిచయం చేసిన నాని, ఇప్పుడు రామ్ జగదీశ్ అనే మరో కొత్త దర్శకుడికి అవకాశమిచ్చారు. దీంతో నయా టాలెంట్‌ను ప్రోత్సహించడంలో నాని ముందుంటారని సినీ పరిశ్రమలో చర్చ నడుస్తోంది. కోర్టు సినిమా ఈనెల 17వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment