నాని బర్త్ డే స్పెషల్.. ది ప్యార‌డైజ్ నుంచి ‘ఆయా షేర్’

నాని బర్త్ డే స్పెషల్.. ది ప్యార‌డైజ్ నుంచి 'ఆయా షేర్'

Summarize with AI

నేచురల్ స్టార్ నాని (Nani) ఈరోజు తన పుట్టినరోజును ఈసారి ఫ్యాన్స్ మ‌ధ్య‌ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు స్పెషల్ ట్రీట్‌గా తన తాజా చిత్రం ది ప్యార‌డైజ్ (The Paradise) నుంచి వరుస అప్‌డేట్లు వస్తున్నాయి. ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని మరింత పెంచేలా చిత్రబృందం మొదటి సింగిల్ ఆయా షేర్‌ (Aya Share) రిలీజ్‌పై అధికారిక ప్రకటన చేసింది.

ఇటీవల ఈ పాటకు సంబంధించిన క్యాచీ ప్రోమోను (Catchy Promo) విడుదల చేయగా, సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. పూర్తి పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉదయం విడుదల అవుతుందని భావించిన వారికి స్వల్ప నిరాశ కలిగించినప్పటికీ, చిత్రబృందం తాజా ప్రకటన ప్రకారం ఈ సాయంత్రం పూర్తి పాట విడుదల కానుంది.

మ్యూజిక్ హైలైట్‌గా మారనున్న ‘ఆయా షేర్‌’
ఈ పాటకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ (Anirudh Ravichander) సంగీతం అందించారు. అడుల జంగిరెడ్డి, అకునూరి దేవయ్యతో పాటు అనిరుధ్ స్వయంగా ఈ పాటను ఆలపించారు. మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఎనర్జిటిక్ లిరిక్స్‌ను కాసర్ల శ్యామ్ కుమార్ రచించారు. నాని స్క్రీన్ ప్రెజెన్స్‌కు తగ్గట్టుగా ఈ పాట ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తెరకెక్కిస్తున్న ఈ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా మొదట నిర్ణయించిన తేదీ నుంచి వాయిదా పడి, ఇప్పుడు ఆగస్టు 21, 2026న విడుదల కానుంది. ఈ పాట విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయని మేకర్స్ నమ్ముతున్నారు. ఈ చిత్రంలో నానికి జోడిగా కాయ‌దు లోహ‌ర్‌ నటిస్తున్నారు. కీలక పాత్రల్లో మోహ‌న్‌బాబు, సోనాలి కుల‌క‌ర్ణి, బాబు మోహ‌న్‌, త‌ణికెళ్ల భ‌ర‌ణి, సంపూర్ణేష్‌బాబు తదితరులు నటిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment