ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సీక్వెల్ మరియు ప్రీక్వెల్ చిత్రాల హవా కొనసాగుతోంది. ఒక సినిమా విజయం సాధించగానే, దాని తదుపరి భాగం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ ట్రెండ్‌లో, మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫ్రాంఛైజీలలో మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం’ సిరీస్ అగ్రస్థానంలో ఉంది. దర్శకుడు జీతూ జోసెఫ్ రూపొందించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్, ఊహించని మలుపులు, ఉత్కంఠభరితమైన కథనంతో ‘దృశ్యం 1’ మరియు ‘దృశ్యం 2’ చిత్రాలతో అద్భుతమైన విజయాలను అందుకుంది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అయ్యి, అక్కడ కూడా రికార్డులను సృష్టించడం విశేషం.
‘ ఇక ‘జైలర్ 2’ వంతు!
తాజా సమాచారం ప్రకారం, ఈ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంఛైజీలో చివరి భాగం అయిన ‘దృశ్యం 3’ షూటింగ్ చాలా సైలెంట్‌గా పూర్తయినట్లు తెలుస్తోంది. ‘జార్జ్ కుట్టి’ పాత్రకు ముగింపు పలకనున్న ఈ పార్ట్ 3 పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అయితే, ‘దృశ్యం 3’ లో తన భాగం పూర్తి చేసుకున్న వెంటనే మోహన్ లాల్ తన తదుపరి ముఖ్యమైన ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారట. ఆ సినిమానే ‘జైలర్ 2’. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఆ చిత్రంలో ఒక ప్రత్యేక అతిథి పాత్రలో మెరిసిన మోహన్ లాల్, ఇప్పుడు ‘జైలర్ 2’ లోని తన పాత్ర షూటింగ్‌ను కంప్లీట్ చేయడానికి సెట్స్‌పైకి ఎంటర్ అయ్యారు.








