ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు రోజురోజుకూ ఉత్కంఠను పెంచుతున్నాయి. దాడులు, హత్యలు, అత్యాచారాలు ఒకపక్క.. కేసులు, అరెస్టులు మరోపక్క.. పార్టీ మధ్య మాటల యుద్ధాలు ఇంకోపక్క.. ఇలా ఏపీ రాజకీయాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఇప్పటికే వైసీపీ లీడర్లు పేర్ని నాని, పోసాని, వల్లభనేని వంశీ, కాకాణి గోవర్ధన్రెడ్డిలపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన కూటమి సర్కార్ (Coalition Government) తాజాగా మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి పేరును తెరపైకి తెచ్చింది. కాగా, కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుల చర్యల్లో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy)ని టార్గెట్ చేస్తోందని వైసీపీ (YSRCP) ఆరోపించింది. ఈ మేరకు వైసీపీ చేసిన ట్వీట్ (Tweet) సంచలనంగా మారింది.
“మద్యం విధానంపై దర్యాప్తు ఇంకా తొలి దశలో ఉందంటూ చెప్పుకుంటూనే, ఏపీ సీఐడీ (CID) అధికారులు ఢిల్లీ (Delhi) కి వెళ్లి అరెస్టు (Arrest) ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇదంతా ముందుగానే పన్నిన కుట్ర భాగమే. ఇంకెంతకాలం ఈ తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు కొనసాగుతాయి చంద్రబాబు (Chandrababu)?” అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.
ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మద్యం పాలసీపై దర్యాప్తే కారణమా? లేక మిథున్ రెడ్డి అనేక సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే ఈ చర్యలు తీసుకుంటున్నారా? అనే అనుమానాలు ప్రజల నుంచి వ్యక్తం అవతున్నాయి.
కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుల్లో భాగంగా వైయస్ఆర్ సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కి కుట్ర
— YSR Congress Party (@YSRCParty) April 5, 2025
మద్యం విధానంపై దర్యాప్తు తొలి దశలోనే ఉందంటూనే.. అరెస్ట్ కోసం ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఐడీ అధికారులు
ఇంకెంత కాలం ఈ తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్ లు @ncbn ? pic.twitter.com/UOrPXSBuuu








