ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అంటే విధానాల పరంగా కొట్లాడటం. కానీ నేటి రాజకీయాల్లో ప్రత్యర్థిని సాంకేతిక కారణాలతో దెబ్బతీయడం, తమ సొంత తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వ్యవస్థలపై ఏడవడం పరిపాటిగా మారింది. మధ్యప్రదేశ్Madhya Pradesh) నుంచి కాంగ్రెస్ (Congress) రాజ్యసభ (Rajya Sabha) అభ్యర్థినిగా బరిలోకి దిగిన మీనాక్షీ నటరాజన్ (Meenakshi Natarajan) నామినేషన్ తిరస్కరణ (Nomination) అంశం ఇందుకు తాజా ఉదాహరణ.
తెలంగాణలో (Telangana) ఉన్న ఒక ప్రైవేట్ కేసు (Private Case) వివరాలను అఫిడవిట్‌లో దాచారనే నెపంతో రిటర్నింగ్ అధికారి ఆనంద్ శర్మ (Anand Sharma) ఆమె నామినేషన్‌ను తిరస్కరించడం, దానిపై ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్, అభిషేక్ సింఘ్వీ, జైరాం రమేష్ బృందం కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ముందు వాలిపోవడం వెనుక అసలు కథ వేరే ఉంది.
ఒక జాతీయ పార్టీ తరఫున, అది కూడా రాజ్యసభ లాంటి ప్రతిష్టాత్మక సభకు అభ్యర్థిని పంపేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం కాంగ్రెస్ “నిర్లక్ష్యానికి” అద్దం పడుతోంది. తెలంగాణలో మీనాక్షీ నటరాజన్‌పై ఒక ప్రైవేట్ ఫిర్యాదు కోర్టు పరిధిలోకి వచ్చిందని కాంగ్రెస్ లీగల్ సెల్ చెబుతోంది. అది కేవలం నోటీసు మాత్రమేనని, పెండింగ్ కేసు కాదని వాదిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే, ఆ చిన్న విషయాన్ని అఫిడవిట్‌లో పేర్కొనడానికి కాంగ్రెస్ లీగల్ టీమ్‌కు వచ్చిన నష్టం ఏంటి?
తప్పు అంతా రిటర్నింగ్ అధికారిదేనని, ఆయన నిర్ణయం ఏకపక్షమని అభిషేక్ సింఘ్వీ (Abhishek Singhvi) లాంటి మేధావులు ఇప్పుడు ఈసీ ముందు గగ్గోలు పెడుతున్నారు. నామినేషన్ వేసే ముందే అన్ని లీగల్ చెక్కులు సరిచూసుకోవాలనే కనీస జ్ఞానం కాంగ్రెస్ (Congress) పెద్దలకు లేదా? ప్రతి చిన్న తప్పుకూ “ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది” అంటూ కార్డు తీయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారంలో బీజేపీ(BJP) ఆడిన మైండ్ గేమ్(Mind Game), రాజకీయ చాణక్యం ఢిల్లీ స్థాయిని మించిపోయింది. ఎక్కడో మధ్యప్రదేశ్‌లో నామినేషన్ వేస్తే, తెలంగాణలో ఉన్న కేసు వివరాలను వెలికితీయడం వెనుక బీజేపీ పెద్ద ఎత్తున పొలిటికల్ గూఢచర్యం నడిపిందనేది స్పష్టమవుతోంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ గడువు ముగిసే వరకు ఉద్దేశపూర్వకంగానే సైలెంట్‌గా ఉన్న బీజేపీ నేతలు, స్క్రూటినీ సమయానికి కరెక్ట్‌గా ఆ కేసు ఆధారాలను అధికారుల ముందు పెట్టారు.
రిటర్నింగ్ అధికారి (Returning Officer) తీసుకున్న నిర్ణయం కూడా తీవ్ర విమర్శలకు గురవుతోంది. కేవలం ఒక ప్రైవేట్ ఫిర్యాదు నోటీసును ప్రాసెస్ కాలేదన్న కాంగ్రెస్ వాదనను కనీసం పరిగణనలోకి తీసుకోకుండా, స్థానిక బీజేపీ(BJP) నేతలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. రాజ్యసభ సీటు గెలవడం కోసం నియమ నిబంధనలను గాలికొదిలేసిన కాంగ్రెస్ అలసత్వం ఒకవైపు.. ఎలాగైనా సీటు దక్కించుకోవాలనే బీజేపీ వ్యూహాలు మరోవైపు. తాజా పరిణామాలతో తెలంగాణ, మధ్యప్రదేశ్ కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది.








