యువ‌తి ప్రాణాలు తీసిన ఏపీ రాజ్యసభ ఎంపీ కుమారుడు

ర్యాష్ డ్రైవింగ్‌తో యువ‌తి ప్రాణాలు తీసిన ఏపీ రాజ్యసభ ఎంపీ కుమారుడు?

Summarize with AI

హైద‌రాబాద్‌లో(Hyderabad) ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఓ యువ‌తి ప్రాణాలు బ‌లితీసుకున్న కేసులో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. మాదాపూర్‌లో(Madhapur) జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) చెందిన జ‌న‌సేన పార్టీ (Jana Sena Party) రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ (Lingamaneni Ramesh) కుమారుడు లింగమనేని సంజుష్‌పై (Lingamaneni Sanjoosh) పోలీసులు కేసు నమోదు అయ్యింది. ఇనార్బిట్ మాల్‌లో(Inorbit Mall) పనిచేస్తున్న 26 ఏళ్ల ఉద్యోగిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనకు సంబంధించి సంజుష్‌ను నిందితుడిగా చేర్చారు.

ఇనార్బిట్ మాల్‌లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో(Lifestyle Store) పనిచేస్తున్న భారతి ముఖి (Bharathi Mukhi) (26) ఆగస్టు 16న మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో మాల్‌కు ఎదురుగా రోడ్డు దాటుతుండగా ఆస్టన్ మార్టిన్ కారు (TG-09-G-0666) ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో తీవ్ర రక్తస్రావం కావడంతో భారతి మృతి చెందింది. ఈ ఘటనపై భారతీ పనిచేసే సంస్థ మేనేజర్ పంజాల అశ్విన్ కుమార్ (Panjala Ashwin Kumar) పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం.. భారతి తన సహోద్యోగి, 26 ఏళ్ల పూజా అశోక్ అలొన్‌తో(Pooja Ashok Alon) కలిసి భోజనం కోసం బయటకు వెళ్లారు. ఐటీసీ కోహినూర్ సమీపంలో ఆహారం తీసుకుని తిరిగి ఇనార్బిట్ మాల్ వైపు వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.

రోడ్డు దాటుతున్న సమయంలో భారతి ఆస్టన్ మార్టిన్ కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారని, అధికంగా రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించి మృతిచెందింది. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేశారు.

ర్యాష్ డ్రైవింగ్ చేసి యువ‌తి ప్రాణాలు బ‌లిగొన్న‌ది ఏపీ జ‌న‌సేన రాజ్య‌స‌భ స‌భ్యుడు లింగ‌మ‌నేని ర‌మేష్ కుమారుడు సంజూష్‌గా పోలీసులు గురించారు. ఘ‌ట‌న జ‌రిగి నాలుగు రోజులు గ‌డుస్తున్నా.. ఎంపీ కుమారుడిని అరెస్టు చేయ‌క‌పోవ‌డంపై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment