‘ఆవిడ‌ను రీల్స్ చూసుకోమ‌నండి’.. హోంమంత్రికి వైసీపీ నేత చుర‌క‌లు

'ఆవిడ‌ను రీల్స్ చూసుకోమ‌నండి'.. హోంమంత్రికి వైసీపీ నేత చుర‌క‌లు

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ (Amarnath) హోంమంత్రి అనిత (Home Minister Anitha)పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విలేక‌రుల స‌మావేశం అనంత‌రం మీడియా ప్ర‌తినిధుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిస్తూ.. `నాపై హోంమంత్రి చేసే వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం లేదు.. మా గురించి అనవసర వ్యాఖ్యలు చేయడం ఆపి, హోంమంత్రి అనిత రీల్స్ చూసుకుంటూ కాలక్షేపం చేస్తే మంచిది అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

వాగ్దానాలు అమ‌లు చేయ‌లేక‌..
గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ, అధికారంలోకి రాగానే ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. “8 నెలల కాలంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. అంతే కాకుండా, ఇప్పటికే రెండున్నర లక్షల వాలంటీర్లను తొలగించారు. రేపటి రోజున ఇంకెవరిని తీసేస్తారో అని ఉద్యోగస్థులు భయపడుతున్నారు. ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు” అని ఆయన ఆరోపించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment