కృష్ణా జిల్లా గూడూరులో అధికార పార్టీ నేత ఒకరు బరితెగించారు. మద్యం షాపు నిర్వాహకుడిపై పచ్చ చొక్కా నేత తన అనుచరులతో కలిసి దాడికి తెగబడ్డారు. పోలీసులు చూస్తుండగానే బాధితుడిని చితకబాదడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..
గూడూరు సెంటర్లో చిలంకుర్తి అశోక్ అనే వ్యక్తి ‘రాయల్ వైన్స్’ పేరుతో మద్యం షాపు నిర్వహిస్తున్నారు. గత రాత్రి కొందరు యువకులు షాపు వద్దకు వచ్చి అప్పుగా బీర్లు ఇవ్వాలని అశోక్‌ను అడిగారు. ఇందుకు ఆయన నిరాకరించడంతో, సదరు యువకులు వేరే షాపు నుంచి మద్యం తెచ్చుకుని అదే రాయల్ వైన్స్ షాపు ముందు కూర్చుని తాగేందుకు ప్రయత్నించారు. తమ షాపు ముందు మద్యం తాగవద్దని, ఇబ్బందిగా ఉంటుందని అశోక్ వారిని వారించారు.
అశోక్ తమను అడ్డుకోవడంతో సదరు యువకులు స్థానిక టీడీపీ నేత, గూడూరు నీటి సంఘం చైర్మన్ పోతన స్వామినాయుడికి ఫిర్యాదు చేశారు. వెంటనే అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్న స్వామినాయుడు, యజమాని అశోక్‌పై విచక్షణారహితంగా దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికీ, ఖాకీలు చూస్తుండగానే అశోక్‌ను కిందపడేసి చితకబాదారు.
ఈ దాడిలో అశోక్ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే ఆయనను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం డాక్టర్ల సూచన మేరకు బాధితుడిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు.
శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన నేతలే ఇలా దౌర్జన్యాలకు దిగడంపై ప్రజలు మండిపడుతున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడి కుటుంబ సభ్యులు స్వామినాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కృష్ణా జిల్లా గూడూరులో రెచ్చిపోయిన టీడీపీ నేత
— Telugu Feed (@Telugufeedsite) May 13, 2026
అప్పుగా బీర్లు ఇవ్వలేదని వైన్ షాప్ నిర్వాహకుడిని చితకబాదిన టీడీపీ నేత
గూడూరులోని రాయల్ వైన్స్ వద్ద గతరాత్రి చోటుచేసుకున్న ఘటన
అప్పుగా బీర్లు ఇవ్వడం కుదరదని చెప్పిన వైన్‌షాపు నిర్వాహకుడు చిలంకుర్తి అశోక్
వేరే షాపు నుంచి… pic.twitter.com/Pc2kSs6qnn








