కొండా సురేఖ ఎపిసోడ్‌పై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

కొండా సురేఖ ఎపిసోడ్‌పై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Summarize with AI

తెలంగాణలో(Telangana) కొండా సురేఖ (Konda Surekha) వ్యవహారం హాట్‌హాట్‌గా కొనసాగుతున్న త‌రుణంలో బీజేపీ ఎంపీ (BJP MP) ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొండా సురేఖ విష‌యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(Revanth Reddy) మద్దతుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (Congress MLAs) నిలబడేందుకు సిద్ధంగా లేకపోవడంతో వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

కొండా సురేఖను విమర్శించేందుకు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి.. వారి నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను (Pending Files) క్లియర్ చేస్తామని (Clear) హామీలు ఇస్తున్నట్లు తనకు సమాచారం ఉందని అరవింద్ పేర్కొన్నారు. ఈ ఆఫర్లు కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకేనా? బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా ఇలాంటి ఆఫర్లు ఇస్తారా? అని ఎంపీ అర‌వింద్ సెటైర్లు పేల్చారు. తమ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ అనేక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.

కాంగ్రెస్‌లో 80 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. వారిలో 16 మంది ఎమ్మెల్యేలతో ప్రెస్‌మీట్లు పెట్టించారని ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలను బతిమిలాడుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో కాంగ్రెస్ నాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొండా సురేఖ ఎపిసోడ్ నేపథ్యంలో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు (Internal Differences) బయటపడుతున్నాయని ఆయన విమర్శించారు.

తెలంగాణలో విద్యార్థులకు (Students) ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) చెల్లించేందుకు సీఎం రేవంత్ రెడ్డికి డబ్బులు లేవని ధర్మపురి అరవింద్ విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు మూసివేత దిశగా వెళ్తున్నాయని ఆరోపించారు. ప్రతి ఏడాది సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని అన్నారు.

ఆక్స్‌ఫర్డ్(Oxford), హార్వర్డ్ (Harvard) యూనివర్సిటీలకు వెళ్లి తెలంగాణకు యూనివర్సిటీలు తీసుకొస్తామని చెబుతున్నారని అరవింద్ విమర్శించారు. ఇప్పటికే ఉన్న యూనివర్సిటీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా వాటిని సంక్షోభంలోకి నెట్టడం ఏమిటని ప్రశ్నించారు. దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలపడానికి విద్యార్థుల విద్య పేరుతో ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని విమర్శించారు.

విద్యార్థులు, నిరుద్యోగులకు (Unemployed) కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కూడా ధర్మపురి అరవింద్ ప్రస్తావించారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి.. ఇప్పుడు తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ఉందన్న విషయాన్నే ప్రభుత్వం మరిచిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment