అమెరికాలో బద్దలైన అగ్నిపర్వతం.. లావా ప్రవాహంతో ఉలిక్కిపడిన హవాయి!

అమెరికాలో బద్దలైన అగ్నిపర్వతం.. లావా ప్రవాహంతో ఉలిక్కిపడిన హవాయి!

Summarize with AI

అమెరికాలో హవాయి బిగ్ ఐలాండ్‌లో ఉన్న చరిత్రాత్మక కిలోవెయా అగ్నిపర్వతం మరోసారి బ‌ద్ద‌లైంది. రాత్రి 2 గంటల సమయంలో భారీ విస్ఫోటనం చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ విస్ఫోటనంతో 80 మీటర్ల (260 అడుగుల) ఎత్తుకు లావా ఎగిసిపడుతూ హవాయి ప్రాంతాన్ని భయాందోళనకు గురి చేసింది.

అగ్నిపర్వతం నుంచి అధికంగా సల్ఫర్ డై ఆక్సైడ్ వాయువు విడుదలవుతోందని, అది వాతావరణంలోని ఇతర వాయువులతో కలిసినప్పుడు ప్రమాదకర మిశ్రమాలుగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ కారణంగా స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.

ప్రపంచంలోనే చరిత్రాత్మక అగ్నిపర్వతాలు
కిలోవెయా 1983 నుంచి క్రియాశీలంగా ఉంది. అప్పటి నుంచి చిన్నతరహా విస్ఫోటనాలు నమోదవుతూ వచ్చాయి. అయితే తాజా ఘటనలో పెద్ద స్థాయిలో లావా ప్రవాహం జ‌రుగుతోంది. ఇది పంటలపై, జీవజాతులపై, వాతావరణంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశముందని అధికారులు తెలిపారు. కిలోవెయా మాత్రమే కాకుండా, ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వతమైన మౌనా లోవా కూడా హవాయి ప్రాంతంలోనే ఉంది. ఈ రెండు అగ్నిపర్వతాల క్రియాశీలత ప్రపంచ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment