కేసీఆర్తో హరీష్ రావు సమావేశం: బనకచర్ల ప్రాజెక్టుపై కీలక చర్చ!

కేసీఆర్తో హరీష్ రావు సమావేశం: బనకచర్ల ప్రాజెక్టుపై కీలక చర్చ!

హైదరాబాద్‌ (Hyderabad)లోని నందినగర్‌ (Nandinagar) నివాసంలో బీఆర్ఎస్ (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (K. Chandrashekar Rao)తో మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) కీలక సమావేశం నిర్వహించారు. గోదావరి-బనకచర్ల (Godavari-Banakacharla) ప్రాజెక్టును కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ముఖ్యమంత్రుల సమావేశం అజెండాలో చేర్చిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బనకచర్ల ప్రాజెక్టును అజెండా నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. మరోవైపు, బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా ఉందని విమర్శలు గుప్పించింది. సీఎం(CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఈ అంశంలో ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేతలు పలు మార్లు ఆరోపణలు చేశారు.

బనకచర్ల (Banakacharla) ప్రాజెక్టుపై మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావు సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందుకు సంబంధించిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment