ఏపీ, తెలంగాణ మధ్య నీటి వివాదాలు బాధాకరం: కవిత

ఏపీ, తెలంగాణ మధ్య నీటి వివాదాలు బాధాకరం: కవిత

Summarize with AI

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినప్పటికీ పరస్పర స్నేహభావంతో, సత్సంబంధాలతో ముందుకు సాగాలని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం కొనసాగాలని అన్నారు. అయితే ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు తలెత్తడం విచారకరమని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడతో వ్యవహరిస్తున్నారని కవిత విమర్శించారు. ఇలాంటి వైఖరి వల్ల రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. నీటి వివాదాలు, అక్రమాల అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించాలని కోరారు. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని, అక్రమాలను అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరస్పర చర్చలు, సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని కవిత సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment