కర్ణాటక రాజకీయాల్లో సంచలనం.. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!

కర్ణాటక రాజకీయాల్లో సంచలనం.. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!

కర్ణాటక రాజకీయాల్లో (Karnataka Politics) ఊహించని భారీ పరిణామం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా సాగుతున్న నాయకత్వ మార్పు ఊహాగానాలకు తెరదించుతూ.. ముఖ్యమంత్రి (Chief Minister) పదవికి సిద్ధరామయ్య (Siddaramaiah) రాజీనామా (Resignation) చేయాలని నిర్ణయించారు. గురువారం ఉదయం తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో ఆయన ఈ సంచలన నిర్ణయాన్ని తన మంత్రివర్గ సహచరులకు అధికారికంగా వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్టానం (Congress High Command) ఆదేశాల మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భావోద్వేగ సన్నివేశాలు చోటుచేసుకున్నాయి.

శివకుమార్ పాదాభివందనం..
బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో సిద్ధరామయ్య తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించగానే.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) ఆయనకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. వెంటనే సిద్ధరామయ్య ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ‘ఆల్ ది బెస్ట్'(All The Best) చెబుతూ అభినందనలు తెలియజేశారు. అనంతరం తన రాజీనామా లేఖను సమర్పించేందుకు సిద్ధరామయ్య గవర్నర్ అపాయింట్‌మెంట్ (Governor Appointment) కోరారు. కాగా, సిద్ధరామయ్య రాజకీయ ప్రయోజనాలకు ఎలాంటి ఢోకా లేకుండా కాపాడుతామని కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

నలుగురు డిప్యూటీ సీఎంల ఫార్ములా?
సిద్ధరామయ్య తప్పుకోవడంతో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. అయితే, సిద్ధరామయ్య వెనుక ఉన్న బలమైన ‘అహిందా'(AHINDA) (మైనారిటీ, వెనుకబడిన తరగతులు, దళితులు) ఓటు బ్యాంక్ చేజారిపోకుండా చూసేందుకు కాంగ్రెస్ అధిష్టానం సరికొత్త సామాజిక సమీకరణాలకు తెరలేపింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో నాలుగు డిప్యూటీ సీఎం పదవులను కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సిద్ధరామయ్య వర్గాన్ని, ఓబీసీ (OBC) ఓటు బ్యాంక్‌ను సంతృప్తి పరిచేందుకు సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర సిద్ధరామయ్యకు (Yathindra Siddaramaiah) డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉంది. సీనియర్ నేత, ప్రస్తుత హోంమంత్రి జి. పరమేశ్వర్ (G. Parameshwara) కు డిప్యూటీ సీఎం పదవి దక్కే ఛాన్స్ ఉంది. కీలకమైన లింగాయత్ వర్గం నుంచి ఎంబీ పాటిల్ కు (MB Patil) ఉపముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించవచ్చని టాక్. ముస్లిం/మైనారిటీ వర్గాల నుంచి మరొకరికి డిప్యూటీ సీఎం పీఠం కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment