సింగరేణి కార్మికుల సమస్యలపై కవిత ఫైర్..

సింగరేణి కార్మికుల సమస్యలపై కవిత ఫైర్..

Summarize with AI

సింగరేణి (Singareni) బాయిబాట కార్యక్రమంలో భాగంగా అడ్రియాల లాంగ్ వాల్ (Long Wall) ప్రాజెక్టు మైన్‌ను సందర్శించిన తెలంగాణ రక్షణ సేన (Telangana Rakshana Sena) చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కార్మికులతో (Workers) మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఓ కార్మికుడు తన ఇబ్బందులను వివరించడంతో చలించిపోయిన కవిత.. కార్మికుల బాధలు విని కంటతడి పెట్టారని తెలిపారు. సింగరేణి (Singareni) కార్మికులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థకు ప్రభుత్వమే విద్రోహిగా మారిందని, దాదాపు రూ.50 వేల కోట్ల బకాయిలతో సంస్థ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆరోపించారు.

సింగరేణిలో కార్మికులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని కవిత విమర్శించారు. అండర్‌గ్రౌండ్ మైనింగ్‌లో (Mining) మెషినరీ అప్‌గ్రేడ్, ప్రమోషన్లు, భద్రతా సౌకర్యాలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం పోరాడతామని స్పష్టం చేసిన ఆమె.. హెచ్ఎంఎస్‌ను (HMS) గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్మికులకు, తమకు మధ్య ఎవరైనా అడ్డుగా వస్తే ఎదుర్కొంటామని హెచ్చరించారు. సింగరేణి కార్మికుల మద్దతు కోసం చేపట్టిన బాయిబాట కార్యక్రమం ద్వారా వారి సమస్యలను వెలుగులోకి తీసుకువస్తామని కవిత పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment