‘ఉద్యోగం నుంచి తొల‌గింపు క‌క్ష‌సాధింపే.. నా పోరాటం ఆగ‌దు’

'ఉద్యోగం నుంచి తొల‌గింపు క‌క్ష‌సాధింపే.. నా పోరాటం ఆగ‌దు'

“ఉద్యోగులను బెదిరించేందుకే నాపై ఈ చర్యలు తీసుకున్నారు. ఇలాంటి బెదిరింపులకు నేను భయపడను. ఉద్యోగుల ప్రయోజనాల కోసం నా పోరాటం చేస్తా” అని ఏపీ (Andhra Pradesh) సెక్ర‌టేరియ‌ట్ (Secretariat) ఉద్యోగుల సంఘం (Employees Association) మాజీ అధ్య‌క్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి (Kakarla Venkatarami Reddy) అన్నారు. వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) ఉత్తర్వులు జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై వెంకట్రామిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు.

తమ హక్కుల కోసం ప్రశ్నిస్తున్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని, ఈ చర్యలకు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. “నన్ను ఉద్యోగం నుంచి తొలగించడానికి ప్రభుత్వం కక్ష కట్టింది. నేను తప్పు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. కనీసం విచారణలో కూడా నాపై వచ్చిన ఆరోపణలను నిరూపించలేకపోయారు. నేను ఎక్కడైనా ఎన్నికల ప్రచారం చేసినట్లు ఒక్క ఆర్టీసీ డిపో మేనేజర్ కూడా రిపోర్ట్ ఇవ్వలేదు. అయినప్పటికీ, ఉద్యోగుల పక్షాన నిలబడుతున్నాననే నెపంతో నన్ను సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు.”

ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ ద్రోహం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన 9 హామీలను విస్మరించారని వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం 4 డీఏలు (4 DAs ) పెండింగ్‌లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కొత్త పీఆర్సీ ఊసే లేదు, ఐఆర్ (IR) ప్రకటించలేదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా అందడం లేదు. సీపీఎస్ (CPS) ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో చంద్ర‌బాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

“గతంలో జగన్ ప్రభుత్వం (Jagan Government) కరోనా వంటి కష్టకాలంలో కూడా ఉద్యోగుల హామీలను నెరవేర్చింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఉద్యోగులకు ద్రోహం చేస్తోంది. ఈ విషయాలను ప్రశ్నించినందుకే నన్ను భయపెట్టాలని చూస్తున్నారు” అని ఆయన అన్నారు.

న్యాయపోరాటం చేస్తా..
తమకు అనుకూలంగా లేనివారిని తిట్టించడం చంద్రబాబుకు అలవాటని, గతంలో బీజేపీని(BJP), ప్రధానిని కూడా ఉద్యోగ సంఘాల నేతలతో తిట్టించిన చరిత్ర ఆయనదని వెంకట్రామిరెడ్డి గుర్తుచేశారు. “నాకు చంద్రబాబు ఉద్యోగం ఇవ్వలేదు. మూడు లక్షల మంది అభ్యర్థులతో పోటీ పడి కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం ఇది. నన్ను అక్రమంగా డిస్మిస్ చేసినందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా. న్యాయపోరాటం చేసి నా ఉద్యోగాన్ని తిరిగి దక్కించుకుంటాను” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment