ప్రతిరోజూ మనం తినే ఆహారమే ప్రాణాలకు ప్రమాదంగా మారితే? అదే ప్రశ్నను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) నటిస్తున్న ‘ది ఇండియా స్టోరీ’ (The India Story). తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబై హైకోర్టు (Mumbai High Court) నేపథ్యంలో రూపొందించిన ఈ పోస్టర్‌లో కాజల్ పవర్‌ఫుల్ లాయర్‌గా (Lawyer) కనిపిస్తుండగా, శ్రేయస్ తల్పడే తన కూతురి భవిష్యత్తు కోసం పోరాడే తండ్రి పాత్రలో ఆకట్టుకుంటున్నారు. అయితే పోస్టర్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం కోర్టులో సాక్షుల బోనులో మనిషికి బదులుగా ఉంచిన పురుగుమందు సిలిండర్. దీంతో ఆహార కల్తీ మాఫియా గుట్టును బయటపెట్టే కథతో ఈ సినిమా రాబోతోందనే ఆసక్తి పెరిగింది.
సామాజిక సమస్యలను బలంగా ప్రస్తావించే కోర్ట్‌రూమ్ (Courtroom) డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి చెట్టన్ డీకే (Chetan DK) దర్శకత్వం వహిస్తున్నారు. కల్తీ ఆహారం (Adulterated Food) కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రమాదాలు, ఆరోగ్యంపై దాని ప్రభావం, దాని వెనుక ఉన్న మాఫియా వ్యవస్థను ఈ సినిమా ద్వారా ఎండగట్టనున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. “ఇది కేవలం సినిమా కాదు.. ప్రతి భారతీయుడి జీవితానికి సంబంధించిన కథ” అని దర్శకుడు పేర్కొనగా, ఇప్పటికే ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. కాజల్ కెరీర్‌లో మరో విభిన్న పాత్రగా నిలవనున్న ‘ది ఇండియా స్టోరీ’ జూలై 24, 2026న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.









బాబు పాలనలో గంజాయి పంటకే గిట్టుబాటు ధర