ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో జనసేన ఇన్చార్జులు (Jana Sena In-Charges), కార్యకర్తల తీరు ప్రజల్లో అసహనం కలిగిస్తోంది. మహిళపై (Women) అఘాయిత్యాలు, దాడులు చేస్తూ పార్టీ పరువు బజారుకీడుస్తున్నారు. ఒకరు మహిళపై లైంగిక వేధింపులకు (Sexual Harassment) పాల్పడడం, అడిగితే నడిరోడ్డుపై దాడి చేయడం, మరొకరు అక్రమ సంబంధాలతో రచ్చకెక్కడం, ఇంకొకరు పిల్లలను కిడ్నాప్ చేయించడం, వేరొకరు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడం.. ఇలా నిత్యం జనసేన నాయకుల అరాచకాలు బయటపడుతూనే ఉన్నాయి. ఓ అరవ శ్రీధర్ (Arava Sridhar), ఓ తాతంశెట్టి నాగేంద్ర (Tatamshetty Nagendra), ఓ కిరణ్ రాయల్(Kiran Royal), ఓ గుండా జయప్రకాష్ నాయుడు (Gunda Jayaprakash Naidu) ఘటనలు మరువక ముందే కదిరిలో మరో దారుణ ఘటన బయటపడింది
జనసేన పార్టీ కదిరి (Kadiri) నియోజకవర్గ ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ (Bhairava Prasad) తన సొంత కుటుంబంపైనే దాష్టీకానికి తెగబడ్డారు. అదనపు డబ్బు కోసం, అలాగే “ఆడపిల్లను ఎలా కన్నావు” అంటూ భార్య (Wife), కుమార్తెను (Daughter) తీవ్రంగా శారీరక, మానసిక హింసకు గురిచేసి, ఇనుప రాడ్‌తో దాడికి పాల్పడటం స్థానికంగా సంచలనం సృష్టించింది.
అసలేం జరిగింది?
బాధితుల ఫిర్యాదు ప్రకారం.. కదిరి టౌన్‌లోని ఎన్జీవో కాలనీలో నివాసముంటున్న భైరవ ప్రసాద్ నివాసంలో ఆదివారం రాత్రి కుటుంబ కలహాలు తీవ్రరూపం దాల్చాయి. భైరవ ప్రసాద్ కొన్ని చెడు అలవాట్లకు బానిసయ్యాడని, వాటి గురించి ప్రశ్నించినందుకు ఆయన భార్య శశికళ (Shashikala) (46)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదనపు డబ్బు తేవాలంటూ, ఆడపిల్లను కన్నావంటూ తీవ్ర పదజాలంతో దూషించి.. ఇంట్లో ఉన్న ఇనుప రాడ్ (ఐరన్ రాడ్) తీసుకుని శశికళ తలపై, శరీరంలోని పలు భాగాలపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
తల్లిపై జరుగుతున్న దాడిని చూసి తట్టుకోలేక, ఆమెను రక్షించేందుకు అడ్డువచ్చిన కూతురు సాయి వర్షిణి (Sai Varshini) (20) పై కూడా భైరవ ప్రసాద్ కనికరం లేకుండా దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో తల్లీకూతుళ్లిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా శశికళ తలకు బలమైన గాయం కావడంతో రక్తస్రావమైంది.
ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.. పోలీసుల కేసు
తీవ్రంగా గాయపడిన శశికళ, వర్షిణిలను స్థానికులు వెంటనే కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు అక్కడ అత్యవసర చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి నుంచి సమాచారం అందుకున్న కదిరి టౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుల నుంచి ప్రాథమిక సమాచారం, వాంగ్మూలాన్ని సేకరించారు. తన భర్త భైరవ ప్రసాద్ నుండి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని భార్య శశికళ ఫిర్యాదులో పేర్కొన్నారు.
భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదిరి టౌన్ పోలీసులు జనసేన నేత భైరవ ప్రసాద్‌పై గృహహింసతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అధికార కూటమిలో కీలక నేతగా ఉన్న వ్యక్తి.. ఇలా సొంత భార్య, కూతురిపైనే ఇనుప రాడ్‌తో దాడికి పాల్పడటం నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఈ ఘటనపై తదుపరి విచారణ జరుపుతున్నారు.








