అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇటీవల డొనాల్డ్ ట్రంప్ చేతిలో కమలా హారిస్ ఓటమిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. డెమోక్రటిక్ పార్టీ ఐక్యత కోసం తాను ఎన్నికల పోటీలో పాల్గొనకపోవడం వల్ల ట్రంప్ గెలిచాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నికల రేసులో పాల్గొనివుంటే, ట్రంప్‌ను కచ్చితంగా ఓడించేవాడిని అన్నారు. బైడెన్ కమలా హారిస్ విజయం సాధిస్తుందని పార్టీ అంతా భావించిందన్నారు. ట్రంప్‌ను అధ్యక్ష పదవికి అడ్డుకోవడం కోసం తమ త్యాగాలను వివరించారు. తన పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా ప్రజా జీవితంలో కొనసాగుతానని స్పష్టం చేశారు. తనకు తప్పు చేసిన అనుభూతి లేదు, క్షమాపణలు అడిగే అవసరం లేదు అని బైడెన్ వ్యాఖ్యానించారు.
ప్రజలను ఉద్దేశించిన వీడ్కోలు ప్రసంగం
జో బైడెన్ తన చివరి ప్రసంగాన్ని జనవరి 15వ తేదీన రాత్రి 8 గంటలకు నిర్వహించనున్నారు. జనవరి 20న అధికారికంగా ట్రంప్‌కు బాధ్యతలు అప్పగిస్తారని ఆయన ప్రకటించారు. తన పదవీ విరమణ తర్వాత కూడా అమెరికా రాజకీయాల్లో చురుగ్గా ఉంటానని బైడెన్ స్పష్టం చేశారు.








