‘నా చావు కోరుకుంటున్నారు..’ – జనసేన ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్‌

'నా చావు కోరుకుంటున్నారు..' - జనసేన ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్‌

Summarize with AI

కొంత‌మంది నాయ‌కులు త‌న చావును కోరుకుంటున్నార‌ని, తాను చ‌నిపోతే బై ఎలక్షన్స్ (by-Elections) వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారని జ‌న‌సేన పార్టీ ఎమ్మెల్యే (Janasena Party MLA) బొల్లిశెట్టి శ్రీ‌నివాస్ (Bollishetti Srinivas) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇన్నేళ్ల ప్రజా జీవితంలో ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని, అధికారులు బెదిరిస్తున్నారు.. తాను ఎమ్మెల్యేను అనే విషయం మర్చిపోయి ప్రవర్తిస్తున్నార అని షాకింగ్ కామెంట్స్ చేశారు. జ‌న‌సేన ఎమ్మెల్యే బొల్లిశెట్టి వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

తాడేపల్లిగూడెం (Tadepalligudem) లో బుధ‌వారం జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చ‌ర్చనీయాంశంగా మారాయి. తాను తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తున్నాన‌ని, తాను ఏ అధికారిని బెదిరించడం, వారిపనికి అడ్డుప‌డ‌డం వంటి ప‌నులు చేయ‌డం లేద‌న్నారు. తాను ప్రజల కోసం ప‌నిచేస్తున్నాన‌ని, ప్ర‌జ‌ల‌తోనే ఉంటాన‌న్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) అండ‌తో తాడేప‌ల్లిగూడెం ప్ర‌జ‌ల దీవెన‌తో తాను ఎమ్మెల్యేగా గెలుపొందాన‌న్నారు. శాసన సభ్యుడి (Legislator) గా త‌న గౌరవం ఇవ్వండి అని ఆయన కూటమి (Coalition) లోని మిత్రపక్ష పార్టీల నేతలకు విజ్ఞప్తి చేయ‌డం గ‌మ‌నార్హం.

Join WhatsApp

Join Now

Leave a Comment