విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) ప్రమాద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం (Coalition Government) ఘోరంగా విఫలమైందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. కోటి (Rs.1 Crore) చొప్పున పరిహారంతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం (Government Job) ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) ఈ సహాయం చేయకపోతే.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రూ. కోటి పరిహారం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
విశాఖలో (Visakhapatnam) సెవెన్‌హిల్స్(SevenHills Hospital), కిమ్స్ ఆసుపత్రుల్లో (KIMS Hospital) చికిత్స పొందుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మృతుల కుటుంబాలను పరామర్శించారు. సెవెన్‌హిల్స్ ఆసుపత్రి వెలుపల మీడియాతో మాట్లాడారు.
‘బోడి’ మీరిచ్చేది ఏంటి లోకేష్?..
ప్రమాద బాధితులకు రూ.1.72 కోట్ల పరిహారం అందుతుందని మంత్రి నారా లోకేష్(Nara Lokesh) చేసిన ప్రకటనపై వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. “లోకేష్ చెబుతున్న రూ.1.72 కోట్లు కార్మికులకు చట్టబద్ధంగా వచ్చే హక్కు. అందులో గ్రూప్ ఇన్సూరెన్స్, పీఎఫ్, గ్రాట్యుటీ, రిస్క్ ఇన్సూరెన్స్ కలిపి రూ.1.45 కోట్లు ఉన్నాయి. యాజమాన్యం ఇచ్చేది రూ.25 లక్షలు, పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చేది రూ.2 లక్షలు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఇస్తున్న ‘బోడి’ సహాయం ఒక్క రూపాయైనా ఉందా?” అని జగన్ నిలదీశారు.
గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఎల్‌జీ పాలిమర్స్ (LG Polymers) ప్రమాదం జరిగినప్పుడు, దేశ చరిత్రలోనే తొలిసారిగా బాధితుల కుటుంబాలకు తక్షణమే రూ. కోటి చొప్పున పరిహారం అందించి, ఉద్యోగాలు కూడా ఇచ్చామని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో (YSRCP Government) కార్మికులు ఎలా ఉన్నారు.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వారి పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ప్రజలు బేరీజు వేసుకోవాలని జగన్ కోరారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల ప్లాంట్‌లో కార్మికుల పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 28 వేల మంది ఉద్యోగులు ఉండగా, ఈ రెండేళ్లలో 10,500 మందికి పైగా ఉద్యోగులను తగ్గించేశారు. 6,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించారని చెప్పారు.
గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి, ప్రధానికి లేఖలు రాసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను (Privatization) గట్టిగా అడ్డుకున్నామని జగన్ గుర్తు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం మానవత్వంతో స్పందించి, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని, అలాగే పాత ప్రమాద బాధితులతో సహా ప్రస్తుత బాధితులందరినీ ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ ప్రభుత్వం చేయకపోతే, తాము అధికారంలోకి రాగానే నెల రోజుల్లోనే న్యాయం చేస్తామని కార్మిక లోకానికి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.









స్పీకర్ అయ్యన్నపై రూ.వెయ్యి కోట్ల దోపిడీ ఆరోపణ!