మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) హీరోగా శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’(Irumudi). ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుండే పాజిటివ్ బజ్ తెచుకున్న ఈ సినిమా మంచి అంచనాల మధ్య ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టింది. ఓవర్సీస్ (Overseas) నుండి వస్తున్న టాక్ ఎలా ఉందంటే..
ఫస్టాఫ్ చాలా నేచురల్‌గా, క్లీన్‌గా సాగుతుంది. భావోద్వేగాలు చక్కగా పండాయి. ఇంటర్వెల్ వైపు వెళ్తున్న కొద్దీ కథలో కాస్త టెంపో, ఇంటెన్సిటీతో పాటు థ్రిల్లర్ సన్నివేశాల్లో కొన్ని లాజిక్ లోపాలు అనిపించినప్పటికీ, సినిమా మాత్రం ప్రేక్షకుడిని ఆద్యంతం ఎంజాయ్ చేసేలా ఆకట్టుకుంటుంది. రవితేజ ఎక్కడ ఓవర్ ది బోర్డు వెళ్లకుండా త్రినాథ్ పాత్రలో సూపర్బ్ పర్ఫామెన్స్ చేసాడు. సెకండాఫ్ ఎమోషనల్ డ్రామాను మరియు ట్విస్ట్‌ను డీల్ చేయడంలో దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) సక్సెస్ అయ్యాడు. అయితే, ట్విస్ట్ వెల్లడైన తర్వాత వచ్చే ఎపిసోడ్ ఇంకాస్త మెరుగ్గా తీయచ్చు అనిపించినా కానీ దర్శకుడు సినిమాను చాలా ఎమోషనల్ క్లైమాక్స్‌తో కథకు తగ్గట్టుగా మలిచాడు.
ఇక ‘మల్లెపూల పల్లకి’(Mallepoola Pallaki) పాటతో కూడిన యాక్షన్ ఎపిసోడ్, ప్రేక్షకుల కోలాహలంతో థియేటర్‌ను హోరెత్తించింది. ఇటీవలి కాలంలో ఒక స్టార్ హీరో తన కమర్షియల్ ఇమేజ్ను పక్కనపెట్టి కథకు మాత్రమే నమ్మి చేసిన సినిమా ఇది. ఎక్కడా కమర్షియల్ హంగులు లేకుండా కథకు తగ్గట్టుగా కథనం సాగుతుంది. థ్రిల్లర్ పోర్షన్స్, ఎమోషనల్ పాయింట్ చాలా బలంగా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది. ఒక స్టార్ ఇమేజ్ను పక్కన పెట్టి కథను నమ్మి నటించిన మాస్ మహారాజా రవితేజకు, అంతే నిజాయితీతో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణ మరియు మైత్రీ మూవీ మేకర్స్‌కు (Mythri Movie Makers) ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గ్యారెంటీ.








