వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 షెడ్యూల్ విడుదల

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 షెడ్యూల్ విడుదల

2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) (2023-25 World Test Championship) టైటిల్‌ (Title)ను సౌతాఫ్రికా (South Africa) గెలిచిన(Won) వెంటనే, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2025-27 సైకిల్‌కు సంబంధించిన షెడ్యూల్‌ (Schedule)ను ప్రకటించింది (Announced). ఈ షెడ్యూల్ ప్రకారం తొమ్మిది జట్లు కలిసి మొత్తం 71 టెస్ట్ మ్యాచ్‌లు (Test Matches) ఆడనున్నాయి. 2025 జూన్ 17న శ్రీలంకలోని గాలే వేదికగా శ్రీలంక (Sri Lanka), బంగ్లాదేశ్ (Bangladesh) మధ్య తొలి మ్యాచ్‌తో ఈ సైకిల్ ప్రారంభమవుతుంది. ఈసారి ఎక్కువ మ్యాచ్‌లు ఆడే జట్లలో ఆస్ట్రేలియా (22 టెస్టులు), ఇంగ్లాండ్ (21 టెస్టులు) ముందు వరుసలో ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో ఈ రెండు జట్ల మధ్య ఆస్ట్రేలియా (Australia) వేదికగా యాషెస్ సిరీస్ (Ashes Series) జరగనుంది.

టీమిండియా షెడ్యూల్:
భారత జట్టు తన WTC 2025-27 క్యాంపెయిన్‌ను జూన్ 20న ఇంగ్లాండ్‌తో లీడ్స్ వేదికగా మొదలుపెట్టనుంది. శుభ్‌మన్ గిల్ (Shubman Gill) సారథ్యంలో (Captaincy) టీమిండియా మొత్తం 18 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. వీటిలో ఎక్కువ భాగం హోమ్ మ్యాచ్‌లే కావడం విశేషం. టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది:

ఇంగ్లాండ్‌ (England)తో: 5 టెస్టులు
వెస్టిండీస్‌ (West Indies)తో: 2 టెస్టులు
దక్షిణాఫ్రికా (South Africa)తో: 2 టెస్టులు
ఆస్ట్రేలియా (Australia)తో: 5 టెస్టులు
శ్రీలంక (Sri Lanka)తో: 2 టెస్టులు
న్యూజిలాండ్‌ (New Zealand)తో: 2 టెస్టులు
టీమిండియా ఆశలు, ఇతర జట్ల మ్యాచ్‌లు:
గత సైకిల్‌లో టీమిండియా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఈసారి ఎక్కువ మ్యాచ్‌లు ఇండియా సొంతగడ్డపై ఉండటంతో విజయం సాధించే అవకాశం అధికంగా ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో గత పరాజయానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం లేకపోలేదు.

ప్రస్తుత ఛాంపియన్ సౌతాఫ్రికా, అక్టోబరులో పాకిస్తాన్‌లో టెస్ట్ సిరీస్‌తో తన మొదటి గేమ్‌ను ప్రారంభిస్తుంది. అయితే 2026 సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం వారి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో వివిధ జట్లు ఆడే టెస్టు మ్యాచ్‌ల సంఖ్య:

ఆస్ట్రేలియా (Australia): 22 టెస్టులు
ఇంగ్లాండ్ (England): 21 టెస్టులు
టీమిండియా (Team India): 18 టెస్టులు
న్యూజిలాండ్ (New Zealand): 16 టెస్టులు
వెస్టిండీస్ (West Indies): 14 టెస్టులు
దక్షిణాఫ్రికా (South Africa): 14 టెస్టులు
పాకిస్తాన్(Pakistan): 13 టెస్టులు
శ్రీలంక (Sri Lanka): 12 టెస్టులు
బంగ్లాదేశ్ (Bangladesh): 12 టెస్టులు

Join WhatsApp

Join Now

Leave a Comment