వాట‌ర్ ప్లాంట్‌కు రూ.58 వేల బిల్లు.. యజమాని షాక్‌

వాట‌ర్ ప్లాంట్‌కు రూ.58 వేల బిల్లు.. యజమాని షాక్‌

Summarize with AI

విద్యుత్ శాఖ (Electricity Department) అధికారుల చ‌ర్య‌తో ఓ ప్లాంట్ య‌జ‌మానిని షాక్‌కు గురిచేసింది. సాధారణంగా నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేల మధ్య వచ్చే కరెంట్ బిల్లు ఒక్కసారిగా రూ.58,089 రావడంతో ఫెర్రీ (Ferry) రోడ్డులోని ఓ వాటర్ ప్లాంట్ (Water Plant) యజమాని షాక్‌కు గురయ్యాడు. ప్లాంట్ యజమాని రాంబాబు (Rambabu) తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల విద్యుత్ శాఖ స్మార్ట్ మీటర్లు (Smart Meters) ఏర్పాటు చేసినప్పటి నుంచి బిల్లులు భారీగా పెరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత 20 రోజులుగా విద్యుత్ శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమస్యకు పరిష్కారం దొరకలేదని ఆవేదన చెందుతున్న రాంబాబు, అధికారుల స్పందన లేకపోవడంతో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment