కారు ప్రమాదం.. దురుసుగా మాట్లాడిన నిర్మాత మురళి

కారు ప్రమాదం.. దురుసుగా మాట్లాడిన నిర్మాత మురళి

Summarize with AI

హైదరాబాద్‌లో(Hyderabad) సినీ నిర్మాత బొమ్మకు మురళికి(Bommakanti Murali) చెందిన కారు(Car) ఢీకొనడంతో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన బుధవారం రాత్రి అబిడ్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చాపల్‌ రోడ్డులో జరిగింది. నాంపల్లి ఆండాలమ్మబాడకు చెందిన సునీత (Sunitha) గన్‌ఫౌండ్రీలోని ఎస్‌బీఐలో హౌస్‌కీపింగ్‌గా పనిచేస్తోంది. విధులు ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా రోడ్డుపై నిలిపి ఉన్న కారు ఒక్కసారిగా ముందుకు కదిలి ఆమెను ఢీకొట్టింది. ప్రమాదంలో సునీత కాలు (Leg) విరిగి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు ఆమెను సమీపంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. కారును నడిపిన డ్రైవర్‌ మహానందను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

పోలీసుల విచారణలో నిర్మాత భార్యను షాపింగ్‌కు తీసుకువచ్చిన డ్రైవర్‌ కారును రోడ్డుపైనే నిలిపి నిద్రపోయినట్లు, అనంతరం నిర్మాత భార్య ఫోన్‌ చేయడంతో నిద్రలేచి కారును స్టార్ట్‌ చేయగా ప్రమాదం జరిగినట్లు ఇన్‌స్పెక్టర్‌ పరశురామ్‌ (Parashuram) తెలిపారు. బాధితురాలి వైద్య ఖర్చులు భరించాలని స్థానికులు కోరగా, తాను డ్రైవర్‌ మాత్రమేనని, యజమాని మురళితో మాట్లాడాలని డ్రైవర్‌ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిర్మాతను సంప్రదించగా.. తనకు సంబంధం లేదని, డ్రైవర్‌నే డబ్బులు అడగాలని చెప్పినట్లు స్థానికులు ఆరోపించారు. ఈ క్రమంలో నిర్మాత దురుసుగా మాట్లాడినట్లు వారు పేర్కొన్నారు. ఘటనపై అబిడ్స్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment