చిన్నారి మాటలకి హరీష్ రావు కంటతడి

చిన్నారి మాటలకి హరీష్ రావు కంటతడి

Summarize with AI

విద్యార్థుల్లో భద్రత, భవిష్యత్‌పై అవగాహన పెంచేందుకు నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు (Harish Rao) భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఓ చిన్నారి (Little Girl) మనసు తడిపేలా (Heart-Touching) మాట్లాడింది. అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఓ చిన్నారి, “నాన్న చనిపోయాడు.. అమ్మే నన్ను చదివిస్తుంది” అని చెప్పడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆ చిన్నారి గుండె లోతుల్లోంచి వ‌చ్చే మాటలు వినగానే హరీష్ రావు తల్లడిల్లిపోయారు. ఆమెను దగ్గరికి పిలిచి ఆలింగనం చేసి ఓదార్చారు. ఆ చిన్నారి కన్నీళ్లతో పాటు హరీష్ రావు (Harish Rao) కూడా కంటతడి పెట్టుకున్నారు (Shed Tears).

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. “జీవితం అంటే మార్కులు, ర్యాంకులు కాదు. జీవిత పాఠాల్ని నేర్చుకోవడమే అసలైన విద్య. మహాత్మా గాంధీ (Mahatma Gandhi) చెప్పినట్లుగా మానవీయ విలువలతో ముందుకు సాగాలి. సెల్ ఫోన్లలో సమయం వృథా చేయొద్దు. ప్రతిరోజూ కొంత సమయం పుస్తకాల కోసం కేటాయించాలి. చదువులో నిబద్ధత పెంచుకోవాలి” అని పిలుపునిచ్చారు.

తెలుగు మన శ్వాస..
తమ మాతృభాష అయిన తెలుగు (Telugu)ను మర్చిపోవద్దని విద్యార్థులకు హరీష్ రావు సూచించారు.
“తెలుగు చదవడం, రాయడం తప్పనిసరిగా నేర్చుకోవాలి. మాతృభాషలోని మాధుర్యాన్ని ఆస్వాదించండి” అని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment