యెమెన్‌పై సౌదీ దాడులు.. భారత విమాన సర్వీసులు రద్దు

యెమెన్‌పై సౌదీ దాడులు.. భారత విమాన సర్వీసులు రద్దు

Summarize with AI

యెమెన్‌లోని (Yemen) హూథీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాకు (Saudi Arabia) చెందిన అరామ్‌కో(Aramco) చమురు సంస్థ ప్లాంట్లు(Oil Company Plants), కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో సౌదీ సేనలు యెమెన్‌లో దాడులు చేపట్టాయి. హూథీల ఆధీనంలోని సనా(Sanaa), ఎర్ర సముద్ర తీరంలోని హొదైదా ప్రాంతాల్లో చమురు సంస్థలపై బాంబు దాడులు జరిగినట్లు సమాచారం. మరోవైపు, రియాద్‌ (Riyadh) వైపు వచ్చిన మూడు డ్రోన్లను సౌదీ రక్షణ దళాలు కూల్చివేసినట్లు వార్తలు వెలువడ్డాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో సౌదీ అరేబియా, హూథీల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. సౌదీ సేనలు సనాను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తే రియాద్‌పై ప్రతిదాడి చేస్తామని హూథీలు హెచ్చరించారు. సౌదీ దాడుల్లో ఇద్దరు మరణించినట్లు హూథీ వర్గాలు తెలిపాయి.

మరోవైపు, సౌదీ అరేబియాకు వెళ్లే భారత విమాన సర్వీసులను ఈ నెల 17వ తేదీ వరకు రద్దు చేసినట్లు సమాచారం. రియాద్‌, దమామ్‌(Dammam), జెడ్డా(Jeddah), మదీనా (Madinah) మార్గాల్లో ఈ రద్దులు అమల్లో ఉన్నాయి. ఉమ్రా యాత్రికులు ప్రయాణానికి ముందు విమానయాన సంస్థలను సంప్రదించాలని జెడ్డాలోని భారత కాన్సులేట్‌ సూచించింది. ప్రవాస భారతీయులకు సహాయం అందించేందుకు 24 గంటల హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment