సంచ‌ల‌నం.. జ‌గ‌న్‌ జిమ్‌కి కోటి రూపాయల కరెంట్ బిల్లు

సంచ‌ల‌నం.. జ‌గ‌న్‌ జిమ్‌కి కోటి రూపాయల కరెంట్ బిల్లు

Summarize with AI

అనకాపల్లిలోని ఒక జిమ్‌కు ఏకంగా కోటి రూపాయల కరెంట్ బిల్లు రావడం సంచలనం సృష్టించింది. ప్రతీ నెల 18,000 నుంచి 20,000 రూపాయల బిల్లుతో సాగుతున్న జ‌గ‌న్ వెల్‌నెస్ అండ్ ఫిట్‌నెస్‌ జిమ్‌కు ఈ నెల బిల్ ఏకంగా రూ. 1 కోటి 15,000 వచ్చిందని నిర్వాహకుడు తెలిపారు. కరెంట్ బిల్లు చూసి షాక్‌కు గురైన నిర్వాహకుడు వెంటనే అధికారులను సంప్రదించగా, ఈ విషయంపై మీడియాతో మాట్లాడవద్దని వారిని హెచ్చరించడం గమనార్హం.

అధికారుల బెదిరింపులపై ప్రశ్నల జల్లు
విద్యుత్‌ శాఖ అధికారి చేసిన తప్పిదమే కారణమని నిర్వాహకుడు భావిస్తుండగా, బిల్లుపై మాట్లాడవద్దంటూ వారిని బెదిరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “సాధారణ వ్యక్తులు ఈ విధమైన అన్యాయాన్ని ఎలా భరించగలరు?” అని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి సంఘటనలు జరుగుతుండటంతో ప్రజలు విద్యుత్ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment