బ‌లం లేక‌పోయినా.. మేయర్ పీఠం కూట‌మి వ‌శం

బ‌లం లేక‌పోయినా.. మేయర్ పీఠం కూట‌మి వ‌శం

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోనే అతిపెద్ద నగర పాలక సంస్థ అయిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మేయర్ (Mayor) పీఠం ఇప్పుడు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి (TDP–JanaSena–BJP Alliance) చేతుల్లోకి వెళ్లిపోయింది. యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన హరివెంకట కూమారి (Hari Venkata Kumari) ని మేయ‌ర్‌గా వైసీపీ (YSRCP) నియ‌మిస్తే.. ఆమెపై కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. తీర్మానాన్ని కూట‌మి నెగ్గింది.

అయితే, ఈ ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. పార్టీకి వ్యతిరేకంగా వెళ్లే కార్పొరేటర్లను అడ్డుకోవాలని విప్(Whip) జారీ చేసినా, వైసీపీ వ్యూహం ఫలించలేదు. చివరికి, మేయర్‌పై అవిశ్వాసం ప్రవేశ పెట్టేందుకు అవసరమైన 2/3 మెజార్టీని కూటమి సాధించింది. ఈ ప్రత్యేక సమావేశానికి మొత్తం 74 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. కోరం సరిపోవడంతో విశాఖ కలెక్టర్ (Visakhapatnam Collector) హరేంధీర ప్రసాద్ (Harendhira Prasad) ఆధ్వర్యంలో ఇన్‌చార్జ్ కమిషనర్ సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం కూటమి విజయం సాధించి విశాఖ మేయర్ పీఠాన్ని తనవైపు తిప్పుకుందని ఇన్‌చార్జ్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌టించారు.

హైడ్రామా మ‌ధ్య మేయ‌ర్‌ ఎన్నిక జ‌ర‌గ్గా, బ‌లం (Strength) లేక‌పోయినా మేయ‌ర్ పీఠాన్ని కూట‌మి కైవ‌సం చేసుకోవ‌డంపై వైసీపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంద‌ని మండిప‌డుతోంది. భ‌య‌పెట్టి, బెదిరించి కార్పొరేట‌ర్ల‌ను త‌మ‌వైపున‌కు తిప్పుకుంద‌ని ఆరోపిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment